Flipkart Big Billion Days 2026 : గేమింగ్ నుంచి కెమెరా వరకు.. ఫ్లిప్కార్ట్ సేల్లో రూ.40 వేల లోపు 4 బెస్ట్ ఫోన్లు!
Flipkart Big Billion Days 2026 : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్లో నథింగ్ ఫోన్ 4a, పోకో X8 ప్రో, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో, ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో స్మార్ట్ఫోన్ల ధరలు, బ్యాంక్ ఆఫర్లు, కీలక ఫీచర్ల వివరాలేంటో చూద్దాం..
- Sreehari A
- Published on- October 14, 2026 / 06:34 PM IST
Flipkart Big Billion Days 2026
- నథింగ్, పోకో, మోటో ఫోన్లపై అదిరిపోయే డీల్స్
- రూ.14 వేల వరకు తగ్గింపు.. రూ.40 వేల లోపు టాప్ 4 స్మార్ట్ఫోన్లు!
- ఫ్లిప్కార్ట్ సేల్లో భారీ ఆఫర్లు.. ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి
Flipkart Big Billion Days 2026 : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్లో అద్భుతమైన డీల్స్పై ఓసారి లుక్కేయండి. రూ.40వేల లోపు బడ్జెట్లోనే ప్రీమియం డిజైన్, పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో 4 స్మార్ట్ఫోన్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. నథింగ్, పోకో, మోటోరోలా, ఇన్ఫినిక్స్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..
నథింగ్ ఫోన్ 4a ధర రూ.30,998కే :
కెమెరా, డిజైన్ పరంగా నథింగ్ ఫోన్ 4a అద్భుతమైన ఫోన్.. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.44,999 కాగా, సేల్లో రూ.36,999కు లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ (Flipkart Big Billion Days 2026) కార్డుతో అదనంగా రూ.6,001 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ.30,998కు తగ్గుతుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, అమోల్డ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్ ఉన్నాయి.
పోకో X8 ప్రో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ :
గేమింగ్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకునేవారు పోకో X8 ప్రోను కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ సేల్ ధర రూ.36,999. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.2,325 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో 6.59 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, 6,500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో :
రూ.39,999 ధరతో లభించే మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోపై యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ.4,850 వరకు తగ్గింపు పొందవచ్చు. 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ అద్భుతమైన ఆప్షన్లుగా చెప్పొచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో :
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ధర రూ.31,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.4వేల వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. అల్యూమినియం ఫ్రేమ్, వైర్లెస్ ఛార్జింగ్, జేబీఎల్ స్పీకర్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
Note : బ్యాంక్ ఆఫర్లు, ఫైనల్ ధరలు కార్డు ఆఫర్లు, నిబంధనలు, స్టాక్ను బట్టి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు ఫ్లిప్కార్ట్లో లేటెస్ట్ ధరలను చెక్ చేశాకే కొనుగోలు చేయండి.
