Smart Two-Wheelers : వావ్.. టూవీలర్లలో కొత్త ట్రెండ్.. ఇక బైకులు, స్కూటర్లలో స్మార్ట్ ఫీచర్లు.. కార్లకు ఏమాత్రం తీసిపోవు!
Smart Two-Wheelers : కార్లలోనే స్మార్ట్ ఫీచర్లు కాదు.. ఇకపై బైకులు, స్కూటర్లలో కూడా స్మార్ట్ ఫీచర్లు రానున్నాయి.. టచ్‌స్క్రీన్, ఏబీఎస్, టీపీఎంఎస్, క్రూయిజ్ కంట్రోల్, జియో ఫెన్సింగ్, స్మార్ట్ కీ వంటి అడ్వాన్స్ బైక్ ఫీచర్లు, ఫీచర్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Smart Bike Features
- బైక్‌లలో టెక్నాలజీ జాతర.. ఈ ఫీచర్లు ఉంటే రైడింగ్ అదుర్స్!
- టచ్‌స్క్రీన్ నుంచి క్రూయిజ్ కంట్రోల్ వరకు..
- బైక్‌లలో కొత్త ట్రెండ్.. సేఫ్టీ నుంచి స్మార్ట్ కనెక్టివిటీ వరకు!
Smart Two-Wheelers : కార్లే కాదు.. మావా.. బైకులు, స్కూటర్లలో కూడా స్మార్ట్ ఫీచర్లు వస్తున్నాయ్.. ఒకప్పుడు టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి మోడ్రాన్ ఫీచర్లు కేవలం కార్లకే పరిమితం. కానీ, ఇప్పుడు టెక్నాలజీ మారింది.
టూవీలర్ వాహనాలు కూడా స్మార్ట్‌గా మారుతున్నాయి. టచ్‌స్క్రీన్ డిస్ప్లేల నుంచి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వరకు ఎన్నో అడ్వాన్స్ ఫీచర్ల బైక్‌లు, స్కూటర్లలో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణాన్ని మరింత ఈజీ కావడంతో పాటు సేఫ్టీని పెంచే ఈ ఫీచర్లపై ఓసారి లుక్కేద్దాం..
టచ్‌స్క్రీన్‌తో కొత్త ఎక్స్పీరియన్స్ :
నార్మల్ స్పీడోమీటర్ స్థానంలో ఇప్పుడు డిజిటల్ టచ్స్క్రీన్లు వస్తున్నాయి. దాంతో వాహన వేగం, బ్యాటరీ ఛార్జింగ్, సమయం, కాల్స్, మొబైల్ నోటిఫికేషన్లు చూడొచ్చు. కొన్ని మోడళ్లలో మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్, మొబైల్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటాయి.
వై-ఫై, బ్లూటూత్ ద్వారా ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ వాల్‌పేపర్‌ను నచ్చిన ఫొటోతో మార్చుకోవచ్చు. వాటర్‌ఫ్రూఫ్, యాంటీగ్లేర్ టెక్నాలజీలు కూడా కొన్ని వాహనాల్లో వస్తున్నాయి. అయితే అన్ని ఫీచర్లు ప్రతి మోడల్లోనూ ఉండవని గమనించాలి.
బ్రేకులు వేస్తే జారిపోదు :
బైక్ భద్రతలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) చాలా కీలకం. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు వీల్స్ లాక్ కాకుండా ఈ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. వీల్ స్పీడ్ సెన్సర్లు వీల్స్ స్పీడ్ గుర్తించి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ద్వారా బ్రేక్ ప్రెజర్ అడ్జెస్ట్ చేస్తాయి.
Read Also : Health Insurance EMI : నెలకు రూ.1,000కే హెల్త్ ఇన్సూరెన్స్.. ఒకేసారి ప్రీమియం కట్టాల్సిన పనిలేదు!
దీంతో వాహనంపై కంట్రోల్ కోల్పోయే ప్రమాదం తగ్గుతుంది. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఒక వీల్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ రెండు వీల్స్ కు పనిచేస్తుంది. కొన్ని అడ్వాన్స్ మోడళ్లలో కార్నరింగ్ ఏబీఎస్ కూడా ఉంటుంది. అయితే, ఏబీఎస్ ఉన్నా తడి రోడ్లు, మలుపుల్లో జాగ్రత్తగా నడపాలి.
టైర్ల హెల్త్‌పై నిఘా :
టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) టైర్లలో గాలి ఒత్తిడిని, కొన్ని వ్యవస్థల్లో టెంపరేచర్ కూడా మానిటరింగ్ చేస్తుంది. గాలి తగ్గితే అలర్ట్ అందిస్తుంది. ఈ సదుపాయం లేని బైక్‌లకు కూడా కొన్ని రకాల టీపీఎంఎస్లను విడిగా సెట్ చేసుకోవచ్చు.
ఒక్క బటన్‌తో ఎన్నో పనులు :
జియో ఫెన్సింగ్‌తో నిర్ణీత రేంజ్ దాటితే మొబైల్‌కు అలర్ట్ వస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ స్టేబుల్ స్పీడ్ ఉండేలా చేస్తుంది. ఆటో హోల్డ్, రివర్స్ మోడ్, ఫాల్ సేఫ్, సైడ్‌స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, స్మార్ట్ కీ, లైవ్ లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా కొన్ని మోడళ్లలో ఉన్నాయి. స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, డ్యాష్‌క్యామ్ లింక్, సాఫ్ట్వేర్ అప్డేట్లు వంటి అనేక ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
మొత్తానికి.. బైక్ అంటే కేవలం టూవీలర్ మాత్రమే కాదు. సేఫ్టీ, సౌకర్యం, స్మార్ట్ కనెక్టివిటీ కలిసి కొత్త ఎక్స్పీరియన్స్.. అయితే స్మార్ట్ బైకులు, స్కూటర్లు కొనే ముందు మీ బడ్జెట్‌కు సరిపోయే మోడల్లో ఏయే ఫీచర్లు ఉన్నాయో చెక్ చేయడం మంచిది.
