Flipkart Big Billion Days Sale : కొత్త ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ వస్తోందోచ్.. 10శాతం బ్యాంకు డిస్కౌంట్ పక్కా..!
Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి పండగే.. త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చే అక్టోబర్ 9 నుంచి సేల్ మొదలు కానుంది. 10శాతం బ్యాంకు డిస్కౌంట్లతో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- September 13, 2026 / 05:58 PM IST
Flipkart Big Billion Days Sale
- అక్టోబర్ 9 నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026
- ఈ సేల్‌లో ఫోన్లు కొనుగోలుపై 10శాతం బ్యాంకు డిస్కౌంట్లు
- లైఫ్‌స్టైల్, వైడ్ రేంజ్ ప్రొడక్టుల వరకు భారీ ఆఫర్లు
Flipkart Big Billion Days Sale : కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా? టీవీ, ల్యాప్ టాప్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనాలని అనుకుంటున్నారా? పండుగ సీజన్‌కు ముందే కొనుగోలుదారులకు భారీ గుడ్ న్యూస్.. అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ సంబంధించి తేదీలు, డీల్స్ వివరాలు లీక్ అయ్యాయి.
ఈ సేల్‌లో సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ ఇతర వస్తువులపై భారీగా డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ సేల్ అక్టోబర్ 9న ప్రారంభమవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, కంపెనీ ఇంకా అధికారికంగా తేదీని వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ల నుంచి లైఫ్‌స్టైల్ వస్తువుల వరకు వైడ్ రేంజ్ ప్రొడక్టులను భారీ ఆఫర్లను పొందవచ్చు.
సేల్ ఎప్పుడంటే? :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టర్ కూడా ఈ తేదీని సూచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే యాక్సెస్ పొందవచ్చు. అక్టోబర్ 8 నుంచి సేల్ డీల్స్ బెనిఫిట్స్ పొందవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
బ్యాంకు ఆఫర్లు :
బిగ్ బిలియన్ డేస్ సేల్ కేవలం ధర డిస్కౌంట్లను మాత్రమే అందించదు. బ్యాంక్ ఆఫర్లు ఖర్చును మరింత భారీగా తగ్గిస్తుంది. ప్రస్తుత వివరాల ప్రకారం.. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్ల ద్వారా 10శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్లకు ఏ బ్యాంక్ కార్డులు అర్హత పొందుతాయనేదానిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు :
బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లపైనే అతిపెద్ద ఆఫర్లు కనిపిస్తాయి. ఈ ఏడాదిలో శాంసంగ్ డివైస్‌ల నుంచి ఐఫోన్‌ల వరకు వైడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందించనున్నాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఒక్కో మోడల్‌కు సంబంధించిన సేల్ ధరలు, డిస్కౌంట్ వివరాలను వెల్లడించలేదు.
మొబైల్ అప్లియన్సెస్ :
ఈ సేల్ సమయంలో మొబైల్ యాక్సెసరీలపై కూడా ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో పవర్ బ్యాంకులు, మొబైల్ ఛార్జర్లు ఇతర అవసరమైన యాక్సెసరీలు ఉండే అవకాశం ఉంది.
లైఫ్ స్టయిల్ ప్రొడక్టులు :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కేవలం టెక్ ప్రొడక్టులకే పరిమితం కాదు. స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ యాక్సెసరీలతో పాటు, లైఫ్‌స్టైల్ ప్రొడక్టులతో సహా వివిధ కేటగిరీలలో డీల్స్ లభించనుంది. ఈ పండుగ షాపింగ్ ఈవెంట్ సందర్భంగా డ్రెస్, పర్సనల్ ప్రొటెక్షన్ ప్రొడక్టులు, హోం అప్లియన్సెస్, ఇతర నిత్యావసరాలపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉండొచ్చు. అయితే, 2026 సేల్‌లోని ప్రతి కేటగిరీకి సంబంధించి తగ్గింపు ఎంత ఉండొచ్చు అనేది త్వరలో రివీల్ కానుంది.
