Vivo Y51 Pro 5G : ఈ వివో 5G ఫోన్‌పై భారీ ఆఫర్.. రూ.54,999 ఫోన్ జస్ట్ రూ.32,999కే..
Vivo Y51 Pro 5G : వివో వై51 ప్రో 5జీ ఫోన్ అసలు ధర రూ.54,999 ఉండగా ఇప్పుడు రూ.32,999కే లభిస్తోంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50MP కెమెరా, 7200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి.
Vivo Y51 Pro 5G
- 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై అద్భుతమైన ఆఫర్లు
- రూ. 54,999 బదులుగా రూ. 32,999 గా లిస్టింగ్ చేసిన కంపెనీ
- ఈ ఫోన్‌పై రూ. 1650 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా
Vivo Y51 Pro 5G Discount : కొత్త 5G ఫోన్ కోసం చూస్తున్నారా? వివో Y51 ప్రో 5Gపై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ ఫోన్ అసలు ధర రూ.54,999 ఉండగా ప్రస్తుతం రూ.32,999కే లభిస్తోంది. అసలు ధరతో పోలిస్తే ఏకంగా రూ.23వేలకు పైగా తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే అదనంగా రూ.1,650 వరకు తగ్గింపు పొందవచ్చు.
రూ.31,349 డిస్కౌంట్ :
ప్రస్తుత ఆఫర్ ప్రకారం.. వివో Y51 ప్రో 5జీలో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు (Vivo Y51 Pro 5G) క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,650 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఫోన్ ధర రూ.31,349కి తగ్గుతుంది. ఈఎంఐ కూడా ఉంది. ఏడాదికి నెలకు సుమారు రూ.2,750 చొప్పున ఈఎంఐ కడితే చాలు.. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
Read Also : Mivi One 5G Launch : బడ్జెట్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్! 3 రంగుల్లో మివి వన్ 5G వస్తోందోచ్.. ధర జస్ట్..
120Hz డిస్ప్లే, డైమన్షిటీ 7360 టర్బో :
ఈ వివో ఫోన్ 6.75 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1250 నిట్స్ వరకు బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమన్షిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను అందించారు. 8GB LPDDR4X ర్యామ్ కూడా ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే.. 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఆప్షన్ ఉంది. సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో ఫోన్ వస్తుంది.
50MP కెమెరా, 7200mAh బ్యాటరీ :
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉండగా, 2MP సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.05 అపర్చర్‌తో 8MP కెమెరా కూడా అందించారు.
బ్యాటరీ విషయానికి వస్తే..
వివో Y51 ప్రో 5జీలో భారీ 7200mAh బ్యాటరీ ఉంది. 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. అలాగే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఈ వివో ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అయితే ధరలు, బ్యాంక్ ఆఫర్లు, స్టాక్ లభ్యత మారే అవకాశం ఉంది.
