Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు!
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా గూగుల్ పిక్సెల్ 11, ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది.
- Sreehari A
- Updated on- October 8, 2026 / 12:32 PM IST
Flipkart Big Billion Days Sale Offers
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ఆఫర్లు
- అక్టోబర్ 9 నుంచి అధికారిక సేల్ ప్రారంభం
- ఐఫోన్, శాంసంగ్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు
Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేసింది.. అక్టోబర్ 9 నుంచి అధికారికంగా సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్లస్, బ్లాక్, ఫ్లిప్ కార్ట్ క్రెడిట్ కార్డు మెంబర్లకు సేల్ అందుబాటులోకి వచ్చింది.
ఈ సేల్ సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం అనేక స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్స్ పై అద్భుతమైన డిస్కౌంట్లు పొందవచ్చు. ఇందులో ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 11, పిక్సెల్ 10ఎ, ఐఫోన్ 17, ఐఫోన్ 16, ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్25, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా వంటి ఫోన్లు డిస్కౌంట్ ధరకే లభించనున్నాయి.
Read Also : Amazon Layoffs : అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ఈసారి 1000 మంది ఔట్.. ఇండియాలో కూడా..!
ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు ఇవే :
- గూగుల్ పిక్సెల్ 11 ధర రూ. 69,999
- ఐఫోన్ 17 ధర రూ. 79,999
- శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ధర రూ. 57,999
- నథింగ్ ఫోన్ (4b) ధర రూ. 27,999
- శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర రూ. 46,999
- మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర రూ. 29,999
- వివో టి5ఎక్స్ 5జీ ధర రూ. 24,999
- ఒప్పో K14x 5జీ ధర రూ. 16,999
- పోకో C85x 5జీ ధర రూ. 13,999
- శాంసంగ్ గెలాక్సీ A36 ధర రూ. 25,999
- మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ధర రూ. 36,999
- రియల్‌మి P4ఎక్స్ ధర రూ. 22,999
- రియల్‌మి P4ఆర్ 5జీ ధర రూ. 20,999
అంతేకాదు.. యాక్సస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ సేల్ సమయంలో మీరు కొనుగోలు చేసే ఫోన్లపై 10శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
అలాగే, అసూస్ ల్యాప్ టాప్ లపై కూడా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. బ్యాంకు ఆఫర్లతో కొన్ని ఎంపిక చేసిన ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్ పీసీలపై 50శాతం వరకు అదనపు డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్స్ వంటి బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.
