Flipkart Freedom Day Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్.. నథింగ్, మోటోరోలా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ఎంతపెట్టి కొనొచ్చంటే?
Flipkart Freedom Day Sale Deals : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 అధికారికంగా ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 4ఎ, మోటోరోలా ఎడ్జ్ 70, మోటోరోలా ఎడ్జ్ 70 రేజర్ ఫోల్డ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభించనున్నాయి.
- Sreehari A
- Updated on- August 4, 2026 / 03:18 PM IST
Flipkart Freedom Day Sale
- ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్
- నథింగ్, మోటోరోలా ఫోన్లపై అద్భుతమైన డీల్స్
- ఈ సేల్ సమయంలో ఫోన్లపై రూ.10వేల వరకు డిస్కౌంట్లు
Flipkart Freedom Day Sale Deals : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ ఆఫర్లతో రెడీ అవుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026ను నిర్వహించనుంది. సేల్ ప్రారంభానికి ముందే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
ముఖ్యంగా నథింగ్, మోటోరోలా స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఇదే అద్భుతమైన అవకాశం. బడ్జెట్ సెగ్మెంట్ నుంచి మిడ్-రేంజ్, ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ల వరకు పలు మోడళ్లపై భారీ తగ్గింపు ధరలకే లభించనున్నాయి. అలాగే, ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్లు, కార్డు డిస్కౌంట్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
నథింగ్, మోటోరోలా ఫోన్లపై భారీ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల ప్రకారం.. ఈ సేల్‌లో నథింగ్ ఫోన్ 4ఎ కేవలం రూ.37,999కు లభించనుంది. అలాగే, నథింగ్ ఫోన్ 4a ప్రో ధర రూ.43,999గా నిర్ణయించగా, నథింగ్ ఫోన్ 4బి మోడల్ రూ.30,999కే కొనేసుకోవచ్చు. మోటోరోలా ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
మోటోరోలా జీ37 పవర్, మోటోరోలా జీ37 మోడళ్లు ఒక్కొక్కటి రూ.13,999కు లభించనున్నాయి. అదే సమయంలో మోటోరోలా ఎడ్జ్ 70, మోటోరోలా ఎడ్జ్ Edge 60 ఫ్యూజన్ మోడళ్ల ధర ఒక్కొక్కటి రూ.27,999గా ఉండనుంది. అదేవిధంగా, మోటోరోలా ఎడ్జ్ జీ60 ప్రో 5జీ ధర రూ.28,999గా ఉండొచ్చు. మోటోరోలా జీ57 పవర్, మోటోరోలా జీ77 పవర్ కొనేవారు ఈ సేల్‌లో రూ.21,999కు సొంతం చేసుకోవచ్చు.
పాత మోడల్ మోటోరోలా జీ06 పవర్ ధర రూ.12,999గా ఉండనుంది. ప్రీమియం కేటగిరీలో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫోన్ రూ.36,999కు, మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ రూ.52,499కు లభ్యం కానున్నాయి. అదేవిధంగా, మోటోరోలా రేజర్ ఫోల్డ్ కూడా రూ.1,39,999 ధరకు లభ్యం కానుంది.
ఫ్రీడమ్ డే సేల్ తేదీలు, అడ్వాన్స్ బుకింగ్ :
ఫ్లిప్‌కార్ట్ షెడ్యూల్ ప్రకారం.. ఫ్రీడమ్ సేల్ 2026 అధికారికంగా ఆగస్టు 8 నుంచి భారతీయ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాదు.. పలు కేటగిరీల్లో కూడా భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్ షిప్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ షిప్, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు యూజర్లకు రెగ్యులర్ కస్టమర్ల కన్నా ఒక రోజు ముందుగానే (ఆగస్టు 7 నుంచే) సేల్‌లో షాపింగ్ చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, కార్డు డిస్కౌంట్లు :
ఈ ఫ్రీడమ్ డే సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ధృవీకరించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రతి స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు, కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఒకేలా ఉండవు.
ఏదైనా ఫోన్ కొనే ముందు సంబంధిత ప్రొడక్ట్ పేజీలో అన్ని ఆఫర్లను చెక్ చేయడం బెటర్. ఫైనల్ రేటు అనేది ఫోన్, బ్యాంక్ ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్‌లు కేవలం కొన్ని ఫోన్లపై మాత్రమే వర్తిస్తాయి. ఆర్డర్ చేసే ముందు పూర్తి ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
