Poco M8 Power Launch : వారెవ్వా.. పోకో కొత్త M8 పవర్ ఫోన్ అదుర్స్.. 8,000mAh బ్యాటరీ హైలెట్.. ధర కూడా తక్కువే!
Poco M8 Power Launch : పోకో నుంచి కొత్త M8 పవర్ ఫోన్ లాంచ్ అయింది. 8000mAh భారీ బ్యాటరీతో అమోల్డ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 4 జెన్ వంటి స్పెషిఫికేషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా?
Poco M8 Power Launch
- పోకో M8 పవర్ 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 8,000mAh బ్యాటరీతో వస్తుంది
- 6.9 అంగుళాల FHD+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 8GB ర్యామ్
- 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు
Poco M8 Power Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. పోకో నుంచి సరికొత్త M సిరీస్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారీ బ్యాటరీతో పోకో M8 పవర్ ఫోన్ లాంచ్ అయింది. ఈ వివో ఫోన్ 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది.
ఈ ఫోన్ 120హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ 3 ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ ఇతర రిటైల్ ఛానెల్ ద్వారా ఈ వారం చివరిలో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. పోకో M8 పవర్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
పోకో M8 పవర్ స్పెషిఫికేషన్లు :
పోకో M8 పవర్ ఫోన్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు.
128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది. 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఛార్జర్ బాక్స్‌లో కూడా వస్తుంది. 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. :
ఈ పోకో ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ షూటర్ ఉంది. ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జీ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, ఐఆర్ బ్లాస్టర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఉన్నాయి.
పోకో M8 పవర్ ధర ఎంతంటే? :
పోకో M8 పవర్ ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వచ్చింది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ఇంట్రడక్టరీ ఆఫర్ ద్వారా కొనుగోలుదారులు సేల్ ప్రారంభమైన మొదటి 12 గంటల్లో రూ .1,000 కూపన్ డిస్కౌంట్‌తో రూ .2వేలు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
