Flipkart Freedom Sale 2026 : కెమెరా ప్రియులకు పండగే.. రూ.10 వేల తక్కువకే పిక్సెల్ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ కావద్దు!

Flipkart Freedom Sale 2026 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 10 డిస్కౌంట్ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Google Pixel 10 flagship phones

  • 6.3-అంగుళాల యాక్చువా ఓఎల్ఈడీ డిస్‌ప్లే సెటప్
  • గూగుల్ పిక్సెల్ 10లో 4970mAh బ్యాటరీ ఉంది
  • 48MP వైడ్ కెమెరా సెటప్, 10MP ఫ్రంట్ కెమెరా

Flipkart Freedom Sale 2026 : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? ఇండిపెండెన్స్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ మొదలైంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ.70వేల బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే గూగుల్ పిక్సెల్ 10 అద్భుతమైన ఆప్షన్. ఈ ఫోన్‌ ధర తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్లతో లభిస్తోంది.

అంతేకాదు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా (Flipkart Freedom Sale 2026) ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10పై తగ్గింపు, ధర స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

గూగుల్ పిక్సెల్ 10 ధర, ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్లపై ఫ్లాట్ రూ.5వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ.69,999 అవుతుంది.

Read Also : Kona El Kahuna Electric Bike : వావ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ అదుర్స్.. ఒక్క ఛార్జ్‌తో 140కి.మీ రేంజ్.. ధర మాత్రం ఊహించలేరు!

మరోవైపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత ఫోన్ ద్వారా కొంటే రూ.72,850 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో ఈ పిక్సెల్ 10 ఫోన్ రూ.79,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు సుమారు రూ.10 వేలు తక్కువ ధరకే లభిస్తోంది.

పిక్సెల్ 10 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :

గూగుల్ పిక్సెల్ 10లో 1080×2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 60-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల యాక్చువా ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందిస్తుంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ జీ5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 4,970mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ కొలతలు 152.8ఎమ్ఎమ్ పొడవు, 72ఎమ్ఎమ్ వెడల్పు, 8.6ఎమ్ఎమ్ మందం, బరువు 204 గ్రాములు ఉంటుంది.

కెమెరా పరంగా పరిశీలిస్తే.. :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.7 అపర్చర్‌తో 48MP వైడ్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/3.1 అపర్చర్‌తో 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, Wi-Fi 6E, బ్లూటూత్ v6, NFC, జీపీఎస్, డ్యూయల్-సిమ్ సపోర్ట్, 3.2 USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.