Flipkart GOAT Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో భారీ ఆఫర్లు.. రూ.30వేల లోపు బెస్ట్ ఫోన్లు దుమ్మురేపుతున్నాయి!

Flipkart GOAT Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2026 జూలై 4 నుంచి ప్రారంభమైంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఇయర్‌బడ్స్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హోం అప్లియన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీగా డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు.

Flipkart GOAT Sale 2026

  • రియల్‌మి P4 ప్రో 5జీ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999
  • శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర రూ. 26,999
  • వివో T5x 5జీ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 మాత్రమే

Flipkart GOAT Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2026 మొదలైందోచ్.. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి టీవీలు, ఇయర్‌బడ్స్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హోం అప్లియన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

రూ. 30వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డీల్స్‌ సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ (Flipkart GOAT Sale 2026) ఆఫర్‌లతో కూడా అదనంగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో రూ. 30వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై లభించే డిస్కౌంట్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

రూ. 30వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు :
రియల్‌మి P4 ప్రో 5జీ :
ఈ రియల్‌మి 5జీ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 26,999గా ఉంది. అయితే, బ్యాంకు ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2300 తగ్గింపు పొందవచ్చు.

దాంతో అసలు ధర నుంచి కేవలం రూ. 24,699కే కొనేసుకోవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కొనుగోలు చేస్తే రూ. 23,700 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ వాల్యూ ఆధారంగా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A36 5జీ :
ఈ శాంసంగ్ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 26,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,825 ధర తగ్గింపు పొందవచ్చు. దాంతో శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ ఫోన్ ధర రూ. 25,174 అవుతుంది.

Read Also : Amazon Prime Day 2026 : అమెజాన్‌లో డిస్కౌంట్ల వర్షం.. రూ.15 వేలలోపే బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు! 

మీ దగ్గర పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 23,700 వరకు ఆదా చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌ ఆధారంగా వాల్యూ ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ :
ఈ మోటోరోలా ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 29,499గా ఉంటే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ. 2900 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ధర రూ. 26,599కే ఫోన్ కొనేసుకోవచ్చు.

అలాగే, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 26,950 వరకు ఆదా చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌ ఆధారంగా ధర తగ్గింపు ఉంటుంది.

వివో T5x 5జీ ఫోన్ :
6GB, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 3050 తగ్గింపు పొందవచ్చు. దాంతో అసలు ధర రూ. 19,949 అవుతుంది.

ఈ ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 22,450 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ :
ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 3,400 తగ్గింపుతో మరెన్నో బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 26,599కు తగ్గుతుంది. అలాగే, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 27,450 వరకు డబ్బులు ఆదా చేయొచ్చు.