Amazon Prime Day 2026 : అమెజాన్‌లో డిస్కౌంట్ల వర్షం.. రూ.15 వేలలోపే బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!
Amazon Prime Day 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 సమయంలో రూ. 15వేల లోపు ధరలో టాప్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
Amazon Prime Day 2026
- అమెజాన్ సేల్‌లో రెడ్మి A7 ప్రో 5జీ ఫోన్ రూ. 12,998కే
- లావా బోల్డ్ N2 5జీ ఫోన్ రూ. 11,999కి లభిస్తోంది
- ఐక్యూ జెడ్10 లైట్ 5జీ ఫోన్ కేవలం రూ. 13,999 మాత్రమే
Amazon Prime Day 2026: కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 మొదలైంది.. ఈ-కామర్స్ సంస్థ ప్రైమ్ సభ్యుల కోసం అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. మీరు తక్కువ ధరకు ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో రియల్‌మి, షావోమీ, లావా వంటి బ్రాండ్ల ఫోన్లను సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ సేల్‌లో డైరెక్ట్ డిస్కౌంట్లతో పాటు, బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ (Amazon Prime Day 2026) క్రెడిట్ కార్డ్‌లతో ఫుల్ పేమెంట్ లేదా ఈఎంఐ లావాదేవీలపై ఎంపిక చేసిన ప్రొడక్టులపై 10శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సమయంలో అనేక స్మార్ట్ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అదనపు బ్యాంక్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు పూర్తి లావాదేవీలపై 5శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ సేల్ సమయంలో రూ. 15 వేల లోపు స్మార్ట్ఫోన్ల పూర్తి లిస్టును మీకోసం అందిస్తున్నాం..
రూ. 15వేల లోపు ధరలో స్మార్ట్ఫోన్లు :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రియల్‌మి, షావోమీ, లావా వంటి బ్రాండ్ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. ప్రతి ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. జూలై 6వ తేదీ వరకు జరిగే ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. ఇంతకీ అమెజాన్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రెడ్మి A7 ప్రో 5జీ :
ఈ సేల్‌లో రెడ్మి A7 ప్రో 5జీ ఫోన్ అసలు ధర రూ.15,999 నుంచి తగ్గి రూ. 12,998కే సొంతం చేయవచ్చు. ఈ ఫోన్‌పై 19శాతం తగ్గింపు అందిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 120Hz రిఫ్రెష్ రేట్, 6300mAh బ్యాటరీ ఉన్నాయి.
లావా బోల్డ్ N2 5జీ :
ఈ సేల్‌లో లావా బోల్డ్ N2 5జీ ఫోన్ అసలు ధర రూ. 15,999 ఉండగా రూ. 11,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై 25శాతం తగ్గింపు పొందవచ్చు. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో పవర్ఫుల్ 6000mAh బ్యాటరీ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ కూడా ఉంది.
రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ :
రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ఫోన్ అసలు ధర రూ.24,999 నుంచి తగ్గి సేల్‌లో రూ. 14,799కే కొనేసుకోవచ్చు. అంటే.. 41శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ ఫోన్లో సెగ్మెంట్లోనే భారీ 7000mAh బ్యాటరీ ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లో అందుబాటులో ఉంది.
ఐక్యూ జెడ్10 లైట్ 5జీ :
ఈ సేల్ సమయంలో ఐక్యూ జెడ్10 లైట్ 5జీ ఫోన్ అసలు ధర రూ.27,999 ఉండగా ఇప్పుడు రూ. 13,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో డైమెన్సిటీ 6300 5G చిప్సెట్ ఉంది. 50MP మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో భారీ 6000mAh బ్యాటరీ కూడా ఉంది.
