Vivo X500 Launch : వారెవ్వా.. వివో ఫ్యాన్స్ కోసం కొత్త వివో X500 సిరీస్ వస్తోంది.. ఫీచర్లు మాత్రం ఓ రేంజ్ అంతే..!
Vivo X500 Launch : వివో నుంచి బేస్ మోడల్, వివో ఎక్స్500 ప్రో, వివో ఎక్స్500 ప్రో మాక్స్, వివో ఎక్స్500ఇ కూడా ఉంటుందని అంచనా. వివో X300 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తోంది.
Vivo X500 Launch
- వివో X500లో 50MP సోనీ ప్రైమరీ కెమెరా ఉండొచ్చు
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64MP సోనీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అంచనా
- రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మొత్తం 4 మోడళ్లు ఉండే ఛాన్స్
Vivo X500 Launch : వివో లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో వివో నుంచి సరికొత్త సిరీస్ రాబోతుంది. వివో X500 సిరీస్‌కు సంబంధించిన కొన్ని లీక్‌లు రివీల్ అయ్యాయి. ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్లో 50MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని అంచనా.
నివేదిక ప్రకారం.. వివో X500 ఫోన్ ఇంజనీరింగ్ ప్రోటోటైప్ కెమెరా (Vivo X500 Launch) యూనిట్ వివరాలు రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ ప్రైమరీ కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 64MP సోనీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయని అంచనా.
బేస్ మోడల్‌తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో వివో X500 ప్రో, వివో X500 ప్రో మాక్స్, వివో X500e మోడల్స్ ఉండవచ్చు. ఇటీవలే ఈ సిరీస్‌లోని వివో X500 ప్రో మాక్స్‌ను కొత్త ఇమేజింగ్ సిస్టమ్‌తో టెస్టింగ్ చేస్తున్నట్టు నివేదిక తెలిపింది.
స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ( అంచనా) :
ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్లో 50MP సోనీ లోఫిక్ ప్రైమరీ కెమెరా ఉండొచ్చు. వివో X500 ప్రో మాక్స్‌లో 85 మిమీ ఫోకల్ లెంగ్త్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. ఈ కెమెరా హై క్వాలిటీతో టెలిఫోటో మాక్రో ఫోటోగ్రఫీకి సపోర్టు ఇస్తుంది. అలాగే 50MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉండొచ్చు.
ఈ సిరీస్‌లోని వివో X500 ప్రో, మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్సెట్తో వస్తుందని అంచనా. ఈ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లో 6.37-అంగుళాల డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉండవచ్చు. వివో X500 ప్రోలో 7,000mAh కన్నా భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా.
ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 7తో రావచ్చు. గత ఏడాది డిసెంబర్లో భారత మార్కెట్లో లాంచ్ అయిన వివో X300 ప్రో స్థానంలో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్తో రన్ అవుతుంది. వివో X300 ప్రోలోని 6,510mAh బ్యాటరీ 90W వైర్డ్, 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
