Flipkart Holi 'Big Bachat Dhamaal Sale' is live with huge discounts on iPhone 13 And iPhone 14 Offers
Flipkart Holi Sale Offer : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వార్షిక హోలీ (Big Bachat Dhamaal Sale) సేల్ మొదలైంది. మార్చి 3 నుంచి మార్చి 5వరకు ఈ హోలీ సేల్
అందుబాటులో ఉంది. ఈ సేల్ కింద ఫ్లిప్‌కార్ట్ వివిధ కేటగిరీల్లో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్టు అయిన దాదాపు లక్ష ప్రొడక్టులపై డీలర్లు గరిష్టంగా 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అన్నింటికన్నా లాభదాయకమైన డీల్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రస్తుతం, ఆపిల్ iPhone 13, iPhone 14 రెండూ ‘బిగ్ బచత్ ధమాల్ సేల్’ సమయంలో భారీ తగ్గింపు ధరలకు ధరలకు అందుబాటులో ఉన్నాయి.
Apple iPhone 13 బేస్ మోడల్ ధర రూ.69,900కు 11శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఆపిల్ ఐఫోన్‌పై రెండు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆపిల్ iPhone 14 బేస్ మోడల్ అసలు ధర రూ. 79,900గా ఉంది. సేల్ సమయంలో 9శాతం తగ్గింపు తర్వాత ఉంటుంది. ఐఫోన్ 13 లాగానే రెండు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ (iPhone13) పై11శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు తర్వాత సేల్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.61,999కి తగ్గుతుంది. అసలు ధర రూ. 69,900తో పోలిస్తే.. రూ.7901 తక్కువగా ఉంటుంది. ఈ డివైజ్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను గరిష్టంగా రూ. 23వేలకు మార్చుకోవచ్చు.
Flipkart Holi Sale Offer : Flipkart Holi ‘Big Bachat Dhamaal Sale’ is live with huge discounts
iPhone 13 ధరను రూ.38,999కి తగ్గిస్తుంది. మీరు మొత్తం రూ. 23వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందించనుంది. ఎందుకంటే.. మీ ఫోన్ బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ రెండు బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ HDFC బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2వేల తగ్గింపు అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై తగ్గింపు :
ఆపిల్ (iPhone14) అసలు ధర రూ. 79,900, (Flipkart) 9శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తర్వాత రూ. 71,999కి అందిస్తోంది. మీరు కొనుగోలు సమయంలో రూ. 7901 ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రూ. 23వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఐఫోన్ ధర రూ. 48,999కి తగ్గుతుంది.
మీరు మొత్తం రూ. 23వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను స్వీకరిస్తారని హామీ ఇవ్వలేం. ఎందుకంటే.. మీ ఫోన్ బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ రెండు బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.