MG Comet EV Model : అత్యంత సరసమైన ధరకే ఎలక్ట్రిక్ కారు.. కళ్లు చెదిరే ఫీచర్లు.. సింగిల్ ఛార్జ్‌తో 300కి.మీ వేగం.. కొంటే ఇలాంటి కారు కొనాల్సిందే..!

MG Comet EV Model : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే అతి త్వరలో భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్ వచ్చేస్తోంది. అత్యంత సరసమైన ధరలో ఈవీ కారు అందుబాటులోకి రానుంది.

MG Comet EV Model : అత్యంత సరసమైన ధరకే ఎలక్ట్రిక్ కారు.. కళ్లు చెదిరే ఫీచర్లు.. సింగిల్ ఛార్జ్‌తో 300కి.మీ వేగం.. కొంటే ఇలాంటి కారు కొనాల్సిందే..!

MG Comet EV to be company's affordable electric model for India

MG Comet EV Model : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే అతి త్వరలో భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్ వచ్చేస్తోంది. అత్యంత సరసమైన ధరలో ఈవీ కారు అందుబాటులోకి రానుంది. MG మోటార్ ఇండియా (MG Motor India) రాబోయే సరసమైన ఎలక్ట్రిక్ వాహనానికి (EV Comet) అని పేరు పెట్టింది. భారత్‌లో MG కామెట్ EV కారు ధర రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని అంచనా. కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో ZS EVని రూ. 22.98 లక్షల నుంచి రూ. 27 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో విక్రయిస్తోంది.

MG ZS EV హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, BYD అటో 3 వంటి వాటికి పోటీదారుగా ఉంది. డిజైన్ పరంగా చూస్తే.. MG కామెట్ EV రీబ్యాడ్జ్ చేసిన Wuling Air EV మాదిరిగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కారు ఇండోనేషియా మార్కెట్లో అందుబాటులో ఉంది. MG కామెట్ EV 25kWh బ్యాటరీతో 50kW మోటార్‌ కలిగి ఉండనుంది. MG కామెట్ EV రేంజ్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 200 కి.మీ నుంచి 300 కి.మీల మధ్య వేగం ఉండవచ్చని అంచనా.

MG Comet EV to be company's affordable electric model for India

MG Comet EV to be company’s affordable electric model for India

Read Also : Itel Pad One Price : ఆపిల్ ఐప్యాడ్ ప్రో ఫీచర్లతో ఐటెల్ ప్యాడ్ వన్ వచ్చేసింది.. కేవలం రూ. 13వేలు మాత్రమే..!

MG కామెట్ EV ఫీచర్ల విషయానికి వస్తే.. Comet EV కంపెనీ ఐదవ మోడల్. 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కార్ టెక్నాలజీతో రానుంది. భారత మార్కెట్లో MG కామెట్ EV పోటీదారుల్లో Tata Tiago.ev, సరికొత్త సిట్రోయెన్ e-C3 కలిగి ఉంటుంది. Tiago.ev ధర రూ. 8.69 లక్షల నుంచి రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా e-C3 ధర రూ. 11.50 లక్షలతో మొదలై రూ. 12.43 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పాల్గొన్న ఐకానిక్ 1934 బ్రిటీష్ విమానానికి కామెట్ EV పేరు పెట్టినట్లు MG తెలిపింది. ఇటీవలే, భారత మార్కెట్లో 2023 MG హెక్టర్‌ను లాంచ్ చేసింది. ఈ హెక్టార్ కారు ధర రూ. 14.72 లక్షల నుంచి రూ. 22.42 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ SUV 11 ఫీచర్లతో ADAS లెవల్ 2 టెక్నాలజీని కలిగి ఉంది. MG కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఆస్టర్, హెక్టర్, గ్లోస్టర్, ZS EVలను విక్రయిస్తోంది.

Read Also : Nubia Z50 Ultra Launch : మార్చి 7న నుబియా Z50 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఈవెంట్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!