Flipkart Mega Bonanza Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్స్.. ఈ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

Flipkart Mega Bonanza Sale : ఆపిల్ ఐఫోన్ 15, మోటోరోలా ఎడ్జ్ 50ప్రో, రియల్‌మి 12ఎక్స్ 5జీ వంటి స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సమయంలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Flipkart Mega Bonanza Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ మొదలైంది. ఈరోజు (జూన్ 13)న నుంచి జూన్ 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం మార్కెట్‌లో వెతుకుతుంటే.. ఇదే సరైన సమయం. ఆపిల్ ఐఫోన్ 15, మోటోరోలా ఎడ్జ్ 50ప్రో, రియల్‌మి 12ఎక్స్ 5జీ వంటి స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సమయంలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Vivo S19 Pro Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో S19 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

1. ఐఫోన్ 15 :
వనిల్లా ఐఫోన్ 15 ధర రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్‌ను నేరుగా 19 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఫోన్ డిస్కౌంట్ ధర రూ. 63,999కు పొందవచ్చు. అనేక ఇతర బ్యాంక్ ఆఫర్‌లు కూడా ధరను మరింత తగ్గించగలవు. ఐఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఐఫోన్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 12ఎంపీ కెమెరాతో 48ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 12ఎంపీ కెమెరా ఉంది.

2. రియల్‌మి 12ఎక్స్ 5జీ :
రియల్‌మి 12ఎక్స్ 5జీ ఫోన్ ధర రూ 17,999కు పొందవచ్చు. ప్రస్తుతానికి, ఈ ఫోన్‌పై ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా రూ.12,999 ప్రత్యేక ధరతో అందిస్తోంది. ఎంచుకున్న క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై వినియోగదారులు రూ. వెయ్యి తగ్గింపును కూడా పొందవచ్చు. రియల్‌మి 12ఎక్స్ 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ మెమరీని కలిగి ఉంది. డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. కెమెరా పరంగా ఫోన్‌లో 50ఎంపీ, 2ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్ 8ఎంపీ ఫ్రంట్ షూటర్‌తో వస్తుంది.

3. రియల్‌మి పి1 5జీ :
రియల్‌మి పి1 5జీ ఫోన్ నేరుగా 23 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.20,999 నుంచి రూ.15,999కి తగ్గింది. ఎంచుకున్న క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు అదనంగా రూ. వెయ్యి తగ్గింపు ఉంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో వస్తుంది. 50ఎంపీ+ 2ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీపై పనిచేస్తుంది.

4. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.36,999. దీనికి అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈఎంఐ రహిత లావాదేవీలపై రూ. 2వేల బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వివో ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లే, 4,500ఎంఎహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. కెమెరా పరంగా 13ఎంపీ, 10ఎంపీ లెన్స్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియోలకు 50ఎంపీ కెమెరా కలిగి ఉంది.

5. వివో టీ3ఎక్స్ 5జీ :
వివో టీ3ఎక్స్ 5జీ నేరుగా 22 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ 5జీ ఫోన్ ధర రూ.17,499 నుంచి రూ.13,499కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు కొనుగోలుపై అదనంగా రూ. వెయ్యి తగ్గింపును కూడా పొందవచ్చు. కొన్ని ఇతర డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వివో ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, పెద్ద 6,000ఎంఎహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో వస్తుంది. 50ఎంపీ+ 2ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Read Also : BMW R 1300 GS : బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త R 1300 జీఎస్ బైక్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు