BMW R 1300 GS : బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త R 1300 జీఎస్ బైక్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

BMW R 1300 GS Launch : బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డెలివరీలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయి. ధర పరంగా ఆర్ 1250 జీఎస్‌తో పోలిస్తే.. కొత్త 1300 జీఎస్ ధర రూ. 40వేలు పెరిగింది.

BMW R 1300 GS : బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త R 1300 జీఎస్ బైక్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

BMW R 1300 GS Launched in India ( Image Source : Google )

BMW R 1300 GS Launch : కొత్త బైక్ కోసం చూస్తున్నారా? ప్రముఖ బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది. బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ రూ. 20.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ లేటెస్ట్ ఏడీవీ ఫుల్‌గా బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా ఈ బైక్ భారత మార్కెట్లోకి వచ్చింది.

Read Also : TVS Apache RTR 160 Series : సరికొత్త బ్లాక్ ఎడిషన్‌తో టీవీఎస్ అపాచీ RTR 160 సిరీస్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డెలివరీలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయి. ధర పరంగా ఆర్ 1250 జీఎస్‌తో పోలిస్తే.. కొత్త 1300 జీఎస్ ధర రూ. 40వేలు పెరిగింది. బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ అనేక ఆప్షనల్ ఎక్స్‌ట్రాలు, ప్యాకేజీలను అందించింది. బీఎండబ్ల్యూ మోటర్రాడ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

బీఎండబ్ల్యూ R 1300 జీఎస్ బైక్ 1,300సీసీ, ట్విన్-సిలిండర్ ఇంజిన్ మోటారుతో రన్ అవుతుంది. గత జనరేషన్ జీఎస్ ఏడీవీ కన్నా ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంది. పీక్ పవర్ అవుట్‌పుట్ ఫిగర్ 143bhp వద్ద ఉండగా, గరిష్ట టార్క్ 149Nm ఉత్పత్తి చేస్తుంది. ఈ బాక్సర్-శైలి ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజిన్ కూడా కింద ఉంది. ఇంకా, ఆర్ 1300 జీఎస్ కూడా ఆర్ 1250 జీఎస్ కన్నా 12కిలోలు తేలికైనది. కానీ, కొంచెం చిన్న 19-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. ముందున్న వెర్షన్ కన్నా ఒక లీటర్ తక్కువగా ఉంటుంది.

భారత్‌లో విక్రయించే వేరియంట్‌ను బీఎండబ్ల్యూ R 1300 జీఎస్ ప్రో అని పిలుస్తారు. స్టైలింగ్ మొత్తం 3 ఆప్షన్లతో వస్తుంది. వీటిని వ్యక్తిగతంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ట్రిపుల్ బ్లాక్, స్టైల్ జీఎస్ ట్రోఫీ, 719 ట్రముంటానా ఉన్నాయి. ట్రిపుల్ బ్లాక్ అనేది ఆప్షనల్ అడాప్టివ్ రైడ్ హైట్ ఫీచర్‌తో ఏకైక వేరియంట్ అయితే, టాప్-ఎండ్ మాత్రమే యాక్టివ్ క్రూయిస్ కంట్రోల్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ మరిన్ని వంటి రాడార్ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్లను పొందుతుంది.

Read Also : Chinese Electric Car : భారత్‌లో ఈ చైనీస్ ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ డేలో 200 యూనిట్లు డెలివరీ.. టాప్ సిటీలివే..!