Flipkart Smartphone Exchange : ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్.. మీ పాత ఫోన్‌‌తో ఇలా చేస్తే.. కేవలం 40 నిమిషాల్లోనే కొత్త ఫోన్ ఇంటికి వస్తుంది..!

Flipkart Smartphone Exchange : ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీసు ద్వారా 40 నిమిషాల్లోనే పాత ఫోన్‌ను కొత్త ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

Flipkart Smartphone Exchange

Flipkart Smartphone Exchange : ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీసును ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ (Flipkart Smartphone Exchange) ను ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు ద్వారా వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను 40 నిమిషాల కన్నా తక్కువ సమయంలో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. తద్వారా పాత ఫోన్ స్వాప్ చేసుకుని కొత్త ఫోన్ ఇంటికి తెప్పించుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీసు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉంది. జూలై చివరి నాటికి ఇతర నగరాలకు విస్తరించనుంది. ఈ ఎక్స్ఛేంజ్ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ యాప్‌లో విలీనం అయింది.

ఆసక్తిగల కస్టమర్లు అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుత ఫోన్ వర్కింగ్ కండిషన్ వివరాలను అందించాలి. అప్పుడు తమ పాత ఫోన్ ఇన్‌స్టంట్ ఎవాల్యూషన్ అందుకుంటారు. అనంతరం మీ ఇంటి వద్దకే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక ఎక్స్ఛేంజ్ ఎక్స్‌పర్ట్ వస్తారు.

రియల్ టైమ్ వాల్యుయేషన్ :
ఈ సర్వీసు రియల్-టైమ్ డివైజ్ వాల్యుయేషన్, ఇన్‌స్టంట్ డోర్ స్టెప్ పికప్ ఆప్షన్ అందిస్తుంది. అదే రోజు ఎక్స్ఛేంజ్ వాల్యూ అప్లికేషన్‌ను అందిస్తుంది. ఈ సర్వీసు చాలా వేగంగా స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్‌ చేసేందుకు వీలుంటుంది.

వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ కండిషన్‌తో సంబంధం లేకుండా దెబ్బతిన్న ఫోన్లతో సహా ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి, ఎక్స్ఛేంజ్ వాల్యూ కొత్త ఫోన్ ధరలో 50శాతం వరకు ఉంటుంది. ఈ సర్వీసు అన్ని రకాల ఫోన్‌లకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Acer Aspire Go 14 : విద్యార్థుల కోసం ఏసర్ బడ్జెట్ ఫ్రెండ్లీ AI ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర కూడా చాలా తక్కువే..!

స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఇలా :
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసేందుకు మీకు నచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రొడక్టు పేజీని ఓపెన్ చేయండి. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవాలి. ప్రొడక్టు పేజీని కిందికి స్క్రోల్ చేయాలి. ఒక ఎక్స్ఛేంజ్ విడ్జెట్‌ కనిపిస్తుంది. అక్కడే “Check Price”పై క్లిక్ చేయండి.

వినియోగదారులు మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్‌ను ఎంచుకోండి. ఆపై ఫోన్ కండిషన్ బట్టి అంచనా ధరను ఎంచుకోండి. ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కన్ఫార్మ్ చేశాక కొత్త ఫోన్ కోసం ఆర్డర్ చేయండి. వాల్యుయేషన్ నుంచి పికప్ వరకు కొత్త ఫోన్ కొనుగోళ్లపై ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ 40 కేవలం నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ సర్వీసు ద్వారా దేశంలోనే ఫస్ట్ హైపర్‌లోకల్ ప్లాట్‌ఫామ్‌ను రియల్-టైమ్ స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఈ వినూత్న విధానం కొత్త ఫోన్ తక్కువ ధరకే తీసుకోవడమే కాకుండా పాత ఫోన్ల రీసైక్లింగ్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ సర్వీసును ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తోంది.