×
Ad

Free AI Tools : 2026లో గూగుల్ జెమిని, పెర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్!

Free AI Tools 2026 : గూగుల్ జెమిని, పర్‌ప్లెక్సిటీ, చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడళ్ల యూజర్ల సంఖ్య పెరుగుతోంది. రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. ఏఐ టూల్స్ ఉచితంగా ఎలా పొందాలంటే?

  • Published On : December 31, 2025 / 08:37 PM IST

Free AI Model Tools 2026 (Image Credit to Original Source)

  • 2026లో కొత్త ఏఐ మోడల్స్ ఉచితంగా పొందొచ్చు
  • గూగుల్ జెమిని, పర్‌ప్లెక్సిటీ, చాట్‌జీపీటీ అన్ని ఫ్రీ
  • గూగుల్ జెమిని ఏఐ ప్రో ప్లాన్ కోసం జియో ప్లాన్ ఇదే
  • ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌‌లో పెర్ప్లెక్సిటీ బ్యానర్‌

Free AI Tools 2026 : కొత్త ఏఐ టూల్ కోసం చూస్తున్నారా? అది కూడా ఉచితంగా కావాలా? ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రతిఒక్కరూ ఏఐ టూల్స్ వినియోగిస్తున్నారు. భారతీయ ఏఐ వినియోగదారుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది.

మీరు కూడా కొత్తగా ఏఐ టూల్ ట్రై చేద్దామని అనుకుంటున్నారా? గూగుల్ జెమిని, పర్‌ప్లెక్సిటీ, చాట్ జీపీటీ వంటి ఏఐ మోడల్స్ యూజర్లందరికి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు, మీరు ఏఐ ద్వారా ఫొటోలు, వీడియోలను జనరేట్ చేయాలని భావిస్తుంటే ఇది మీకోసమే.. ఎందుకంటే చాలా ఏఐ కంపెనీలు దేశంలో ఏఐ మోడల్స్ ప్రో, ప్రీమియం ప్లాన్‌లను ఉచితంగా అందిస్తున్నాయి.

గూగుల్ జెమిని ఏఐ ప్రో ఫ్రీ ప్లాన్ :

గూగుల్ అన్ని జియో సబ్‌స్క్రైబర్‌లకు 18 నెలల పాటు ఫ్రీగా జెమిని ఏఐ ప్రోను అందిస్తోంది. ఇందులో చాలా వరకు అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు వియో బై గూగుల్, జెమిని, నానో బనానా ప్రో వంటి అన్ని ఏఐ మోడళ్లకు యాక్సెస్ పొందవచ్చు.

Read Also : 5 Upcoming Phones : గెట్ రెడీ! 2026 జనవరిలో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే, ఏది కావాలో మీదే ఛాయిస్!

మీరు చేయాల్సిందల్లా.. అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ అందించే జియో నుంచి ప్రీపెయిడ్ ప్లాన్‌ పొందవచ్చు. ఆ తర్వాత, మీరు మైజియో యాప్‌కి వెళ్లి గూగుల్ జెమిని ఏఐ ప్రో ప్లాన్ బ్యానర్‌పై ట్యాప్ చేసి మోడల్‌తో కంటిన్యూ అవ్వొచ్చు.

పెర్ప్లెక్సిటీ ప్రో (Perplexity Pro) ఫ్రీ :

ఎయిర్‌టెల్ యూజర్ల పెర్ప్లెక్సిటీ ప్రో ఉచితంగా అందిస్తోంది. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా పెర్ప్లెక్సిటీ భారతీయ అన్ని ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లకు ఏఐ మోడల్ ప్రో వెర్షన్‌కు ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది.

Free AI Tools 2026 (Image Credit to Original Source)

అంతేకాదు.. పెర్ప్లెక్సిటీతో పాటు కామెట్ ఏఐ బ్రౌజర్‌కు కూడా మీరు యాక్సెస్ పొందవచ్చు. మీరు అధికారిక ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌కి వెళ్లి పెర్ప్లెక్సిటీ బ్యానర్‌ను ట్యాప్ చేసి వివరాలను సమర్పించండి. మీరు ఉచితంగా పెర్ప్లెక్సిటీ ప్రో యాక్సస్ చేయొచ్చు.

ఓపెన్ ఏఐ (OpenAI) :
భారతీయ యూజర్లకు ChatGPT Go అందిస్తోంది. గతంలో ఓపెన్ఏఐ ద్వారా భారత మార్కెట్లో రూ. 399కి అందుబాటులో ఉన్న చాట్ జీపీటీ గో ప్లాన్ ఇప్పుడు ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు మరిన్ని ఇమేజ్ జనరేషన్, పర్సనలైజడ్ రెస్పాన్స్ కోసం ఎక్కువ మెమరీ, ప్రాజెక్ట్‌లకు యాక్సెస్, వర్క్‌ఫ్లోలు వంటివి అన్ని పొందవచ్చు.