5 Upcoming Phones : గెట్ రెడీ! 2026 జనవరిలో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే, ఏది కావాలో మీదే ఛాయిస్!

5 Upcoming Phones 2026 : భారత మార్కెట్లో 2026 జనవరిలో రాబోయే ఫోన్లలో రియల్‌మి 16 ప్రో, ఒప్పో రెనో 15, పోకో ఎం8, వన్‌ప్లస్ టర్బో 6, మోటరోలా సిగ్నేచర్ ఫోన్లు ఉన్నాయి.

5 Upcoming Phones : గెట్ రెడీ! 2026 జనవరిలో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే, ఏది కావాలో మీదే ఛాయిస్!

5 Upcoming Phones 2026 (Image Credit to Original Source)

Updated On : December 31, 2025 / 7:58 PM IST
  • 2026లో లాంచ్ కానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్లు
  • రియల్‌మి, ఒప్పో నుంచి పోకో వన్‌ప్లస్ మోటోరోలా ఫోన్లు
  • జనవరిలో ఒప్పో రెనో 15 సిరీస్‌ లాంచ్
  • రియల్‌మి 16 ప్రో రూ.34,999 రియల్‌మి ప్రో ప్లస్ ధర రూ.38,999

5 Upcoming Phones 2026 : కొత్త ఏడాదిలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2026 ఏడాదిలో భారతీయ మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ఫోన్లు రాబోతున్నాయి. ప్రత్యేకించి అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి.

2025లో భారీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల తర్వాత బ్రాండ్‌లు అద్భుతమైన కెమెరాలు, ప్రీమియం డిజైన్, ధరలతో (5 Upcoming Phones 2026) మిడ్-రేంజ్ ఫోన్‌లపై ఫోకస్ పెడతున్నాయి. రాబోయే ఫోన్లలో రియల్‌మి, ఒప్పో నుంచి పోకో, వన్‌ప్లస్, మోటోరోలా వరకు జనవరి 2026లో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్‌లపై ఓసారి లుక్కేయండి.

రియల్‌మి 16 ప్రో సిరీస్ :

రియల్‌మి 16 ప్రో సిరీస్‌ జనవరి 6, 2026న లాంచ్ కానుంది. ఈ లైనప్‌లో రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ ఉన్నాయి. ఈ రెండూ ప్రీమియం డిజైన్ కెమెరా పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు. భారతీయ మొబైల్ మార్కెట్లో రియల్‌మి 16 ప్రో ధర రూ.34,999 , రియల్‌మి ప్రో ప్లస్ ధర రూ.38,999 నుంచి లాంచ్ అవుతుందని అంచనా.

ఒప్పో రెనో 15 సిరీస్ :
భారత మార్కెట్లో వచ్చే జనవరిలో ఒప్పో రెనో 15 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఒప్పో రెనో 15, రెనో 15 ప్రో కాంపాక్ట్ రెనో 15 ప్రో మినీ ఉన్నాయి. కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు. ఒప్పో ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌, హోలోఫ్యూజన్ డిజైన్ టెక్నాలజీని లైనప్ ధృవీకరించింది. మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ స్టయిల్ కోరుకునే యూజర్లనే లక్ష్యంగా చేసుకుంది.

Read Also : Realme GT 7 Pro : రియల్‌మి జీటీ 7 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్! అమెజాన్‌లో రూ. 10వేల లోపు ధరకే మీ సొంతం

పోకో M8 సిరీస్ :

భారత మార్కెట్లో పోకో M8 లైనప్‌ను జనవరి 8, 2026న ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ద్వారా లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో పోకో M8 5G, పోకో M8 ప్రో 5G ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో స్లిమ్ 7.35mm డిజైన్‌లు, ఈజీ బిల్డ్‌లు, 50MP ఏఐ కెమెరా ఉంటాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలకు అదిరిపోయే స్పెషిఫికేషన్లతో పోకో ట్రెండ్‌ను కొనసాగించనుంది.

Oppo Reno 15 Series

Oppo Reno 15 Series  (Image Credit to Original Source)

వన్‌ప్లస్ టర్బో 6 :
వన్‌ప్లస్ టర్బో 6, వన్‌ప్లస్ టర్బో 6V ఫోన్లు వచ్చే జనవరి 8న చైనాలో లాంచ్ కానున్నాయి. టర్బో 6లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K డిస్‌ప్లే ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 9000 mAh బ్యాటరీ ఉన్నాయి. 2026లో భారత మార్కెట్లో ఈ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 6గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

మోటోరోలా సిగ్నేచర్ :
మోటోరోలా కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటోరోలా సిగ్నేచర్‌ను జనవరి 7, 2026న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఫుల్ స్పెసిఫికేషన్లు ఇంకా రివీల్ చేయలేదు. అధికారిక టీజర్‌లను పరిశీలిస్తే.. ప్రీమియం డిజైన్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందిస్తుంది. అదిరిపోయే ఫొటోగ్రఫీ కెపాసిటీని సూచిస్తాయి. మోటోరోలా ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా మరిన్ని ఫీచర్ల వివరాలు త్వరలో రివీల్ అయ్యే అవకాశం ఉంది.