శాంసంగ్ గెలాక్సీ S21 Ultra ఫోన్ ఫీచర్లు లీక్.. బెస్ట్ టెలిఫొటో కెమెరాలు

  • Publish Date - November 16, 2020 / 10:46 AM IST

Galaxy S21 Ultra best telephoto cameras : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ తమ గెలాక్సీ సిరీస్ నుంచి కొత్త మోడల్ తీసుకురాబోతోంది. గెలాక్సీ S21సిరీస్ అధికారిక లాంచ్‌కు రెండు నెలల వ్యవధే ఉంది. కానీ, గెలాక్సీ S21 అల్ట్రా ఫోన్, గెలాక్సీ S21 ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్ అయ్యాయి.



వచ్చే ఏడాదిలో శాంసంగ్ కొన్ని మెరుగైన ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈలోపే గెలాక్సీ S21 స్మార్ట్ ఫోన్ సంబంధించి ఫీచర్లు ముందుగానే లీక్ అయ్యాయి. హైఎండ్ గెలాక్సీ S21 సిరీస్ ఫోన్లలో రెండు 10MP టెలిఫొటో కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అందులో ఒకటి 3x ఆప్టికల్ జూమ్ లెన్స్, మరొకటి 10X ఆప్టికల్ జూమ్ లెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పవచ్చు.



ఇప్పటివరకూ ఏ ఫోన్లలో లేని బెస్ట్ టెలిఫొటో కెమెరాలు కావడం విశేషం. లార్జ్ సెన్సార్లు, ఫాస్టర్ ఆటోఫోకస్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయి. గెలాక్సీ S21 అల్ట్రాలో టెలిఫొటో కెమెరాలు రెండూ 1/2.8 అంగుళాల సెన్సార్లతో 1.22µm ఫిక్సల్స్, డ్యుయల్ ఫిక్సల్ ఫేస్ డెటెక్షన్ ఆటోఫోకస్ ఉన్నాయి.
https://10tv.in/nokia-8000-4g-nokia-6300-4g-feature-phones-launched-price-specifications/



ఈ మోడల్ ఫోన్‌లో 48MP (1/2 అంగుళాలు) సెన్సార్ ఉండగా, గెలాక్సీ S20 అల్ట్రా వెర్షన్ మాదిరి 0.8µm ఫికల్స్ అందిస్తోంది. డ్యుయల్ ఫిక్సల్ ఆటో ఫోకస్‌తో టెలిఫొటో కెమెరాలు వేగంగా ఫోకస్ క్యాప్చర్ చేయొచ్చు.

గెలాక్సీ S20 అల్ట్రాతో పోలిస్తే.. గెలాక్సీ s21 అల్ట్రా బెస్ట్ ప్రోట్రేయట్ ఫొటోలను తీయగలదు. ఇందులోని 3x టెలిఫొటో కెమెరా అద్భుతమైన ఫొటోలను తీయగలదు. ఈ ఫోన్ Phantom Black, Phantom Silver రెండు కలర్లలో అందుబాటులో రానుంది.



Galaxy S21 Ultra ఫీచర్లు ఇవే :
* 6.8 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ-0 LTPO డిస్‌ప్లే, QHD+ రెజుల్యుషన్
* 1,600 నిట్స్ బ్రైట్ నెస్, 1Hz-120Hz వేరిబుల్ రీప్రెష్ రేట్
* S Penతో ఫోన్ ఫీచర్ కంపాటబుల్
* ఆండ్రాయిడ్ 11, వన్ UI 3.1
* Exynos 2100 ప్రాసెసర్ (స్నాప్ డ్రాగన్ 875)
* రెండో జనరేషన్ 108MP ప్రైమరీ కెమెరా
* 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫొటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్)
* 10MP టెలిఫొటో కెమెరా, 10x ఆప్టికల్ జూమ్
* డ్యుయల్ వీడియో రికార్డింగ్, 4K/60fps
* 8K/30fps వీడియో రికార్డింగ్ (ప్రైమరీ కెమెరా)
* 5G, 4G, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై 6E, GPS, బ్లూటూత్ 5.1, NFC, USB టైప్-C పోర్ట్
* స్టీరియో స్పీకర్లు, అండర్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ రీడర్
* 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్
* వైర్ లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్

ట్రెండింగ్ వార్తలు