AI Smart Glasses : మెటా రే బ్యాన్స్‌కు పోటీగా కొత్త AI స్మార్ట్ గ్లాసెస్.. మీ ఫోన్ చూడకుండానే కాల్స్, మెసేజ్‌లు పంపొచ్చు!
AI Smart Glasses : గూగుల్ I/O 2026లో శాంసంగ్, గూగుల్ ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరించాయి. మెటా రే బ్యాన్స్ కు పోటీగా ఫొటోలు, వీడియోల కోసం ఇంటర్నల్ కెమెరాలతో పాటు ఏఐ ఎడిటింగ్ సామర్థ్యాలతో వస్తుంది.
- Sreehari A
- Published on- May 20, 2026 / 04:50 PM IST
AI Smart Glasses
- గూగుల్, శాంసంగ్ నుంచి కొత్త జెమిని ఏఐ స్మార్ట్ గ్లాసెస్
- గూగుల్ ఐ/ఓ 2026లో ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరణ
- ఫొటోలు, వీడియోలకు ఇంటర్నల్ కెమెరాలతో ఏఐ ఎడిటింగ్
AI Smart Glasses : గూగుల్ ఐ/ఓ 2026లో కొత్త ఏఐ స్మార్ట్‌గ్లాసెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గూగుల్, శాంసంగ్ సంయుక్తంగా ఆండ్రాయిడ్ ఎక్స్‌ఆర్ ఎకోసిస్టమ్‌లో ఈ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌గ్లాసెస్‌ను ఆవిష్కరించాయి.
ఈ స్మార్ట్ గ్లాసెస్ పూర్తిగా జెమిని ఏఐపై ఆధారపడి పనిచేస్తుంది. కంపెనీ ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను ఆడియో గ్లాసెస్, డిస్‌ప్లే గ్లాసెస్ అనే రెండు కేటగిరీలలో రిలీజ్ చేసింది. ఆడియో గ్లాసెస్ యూజర్లకు వాయిస్ అసిస్టెన్స్, కాలింగ్ ఫీచర్లను అందిస్తాయి. కాగా, డిస్‌ప్లే గ్లాసెస్ వ్యూ డేటాను నేరుగా కళ్లతో చూడొచ్చు.
ఫోన్ లేకుండా ఫుల్ కంట్రోలింగ్ :
ఈ స్మార్ట్ గ్లాసెస్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి కో డివైజ్ మాదిరిగా పనిచేస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌ను తీయకుండానే కాల్స్, మెసేజ్‌లు అందుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్‌లను కూడా చూడవచ్చు. ఇందులో ఓవర్-ఇయర్ స్పీకర్లు ఉన్నాయి. కాల్స్, మ్యూజిక్ కోసం అత్యుత్తమ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.
Read Also : Google I/O 2026 : మీ మాటే కమాండ్..! జస్ట్ ఏ వీడియో కావాలో చెప్పండి.. యూట్యూబ్ AI మీకోసం వెతికిపెడుతుంది!
రియల్-టైమ్ ట్రాన్సులేషన్, జెమిని ఏఐ :
ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో రియల్-టైమ్ ట్రాన్సులేషన్ ఫీచర్ అత్యంత ముఖ్యమైన ఫీచర్. యూజర్ సంభాషణలను తక్షణమే మరో భాషలోకి మార్చగలదు. జెమిని ఏఐ యూజర్లు తమ సమీపంలోని ప్రదేశాలు, సంకేతాలు, వస్తువుల గురించి సమాచారాన్ని అడగవచ్చు.
అలాగే, ‘Hey Google’ అని చెప్పినా లేదా ఫ్రేమ్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఏఐని యాక్టివేట్ చేయవచ్చు. అప్పుడు ఏఐ వెంటనే పరిసరాలను విశ్లేషిస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. నావిగేషన్‌లో కూడా సాయపడుతుంది.
కెమెరా ఎడిటింగ్ ఫీచర్లు :
ఈ స్మార్ట్ గ్లాసెస్ ఫొటోలు, వీడియోలకు కూడా సపోర్టు చేస్తాయి. జెమిని ఏఐ, నానో బనానా వంటి టూల్స్ సహా యూజర్లు అనవసరమైన వస్తువులను రిమూవ్ చేయడం లేదా ఫొటోలను అప్‌గ్రేడ్ వంటి ఇమేజ్ ఎడిటింగ్ కూడా చేయవచ్చు.
ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ను గూగుల్ జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్, శాంసంగ్ హార్డ్‌వేర్ స్కిల్, ప్రీమియం ఐవేర్ బ్రాండ్‌ల డిజైన్‌లతో రూపొందించారు. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ల స్థానాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.
శాంసంగ్, గూగుల్ గానీ ఈ స్మార్ట్ గ్లాసెస్ అధికారిక ధరలను ఇంకా వెల్లడించలేదు. అయితే, గతంలో లీక్‌ల ప్రకారం.. నాన్-డిస్‌ప్లే వెర్షన్‌లు సుమారు 379 డాలర్ల నుంచి 499 డాలర్ల మధ్య ఉంటుందని సూచించాయి. అదేగానీ నిజమైతే నేరుగా మెటా రే-బాన్ రేంజ్ స్మార్ట్ గ్లాసెస్‌కు పోటీగా నిలుస్తాయి.
