Google Chrome : ఆండ్రాయిడ్ డివైజ్ క్రోమ్ బ్రౌజర్లలో కొత్త ప్రైవసీ ఫీచర్.. చెక్ చేశారా?

గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. గూగుల్ క్రోమ్.. మీ ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో కొత్త ప్రైవసీ ఫీచర్ రానుంది. ప్రైవసీకి సంబంధించి అనేక ఫీచర్లను క్రోమ్ యూజర్లుకు జోడించనుంది.

Chorme new privacy feature : గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. గూగుల్ క్రోమ్.. మీ ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో కొత్త ప్రైవసీ ఫీచర్ ఒకటి రానుంది. ఇప్పటికే డెస్క్‌టాప్ వెర్షన్ నుంచి ప్రైవసీ రివ్యూ ఫీచర్ టెస్టింగ్ ప్రారంభించిన గూగుల్ క్రోమ్. సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రైవసీకి సంబంధించి అనేక ఫీచర్లను క్రోమ్ యూజర్లుకు జోడించనుంది. ఈ క్రోమ్ బ్రౌజర్‌లో కంట్రోల్స్ మొత్తం బ్రౌజింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. రెండు టోగుల్ మాత్రమే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి తీసుకురానుంది.

క్రోమ్ అప్‌డేట్ విషయానికి వస్తే.. మీరు బ్రౌజర్ లో ఏది షేర్ చేసినా దానికి సంబంధించిన డేటాను కంపెనీకి చేరవేస్తుంది. తద్వారా అడ్రస్ బార్‌లో స్పీడ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. రెండవ టోగుల్ హిస్టరీ సింకరైజ్ ద్వారా మీరు సైన్ ఇన్ చేసిన అన్ని డివైజ్‌ల్లో మీ బ్రౌజింగ్ హిస్టరీని సింకరైజ్ చేసుకునేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ హిడెన్ మోడల్‌లో ఉంది. మీ Android స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. షట్‌డౌన్ హ్యాంగ్‌ను పరిష్కరించేందుకు కంపెనీ లోకల్ క్యాచి (cache)ను కూడా తొలగించింది గూగుల్ క్రోమ్. స్టార్టప్ వేగవంతం చేయడమే లక్ష్యంగా స్థానిక కాష్ Chrome హిస్టరీ సిస్టమ్‌కు చేర్చింది.

మీ Android స్మార్ట్‌ఫోన్‌లో Chrome బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.
Chrome బ్రౌజర్ అడ్రస్ బార్‌లో chrome://flags అని టైప్ చేయండి.
ప్రైవసీ రివ్యూ (privacy review) కోసం డ్రాప్‌డౌన్‌లో ‘Privacy’ కోసం సెర్చ్ చేయండి.
‘Enable’ ఎంచుకోండి.. ఆపై బ్రౌజర్‌ను రీస్టార్ట్ (Restart) చేయండి.
ప్రైవసీ సెట్టింగ్‌లను రివ్యూ చేసేందుకు మూడు డాట్స్ ఐకాన్‌పై నొక్కండి.
ఆ తర్వాత సెట్టింగ్‌ (Settings)పై నొక్కండి.
Privacy and Security సెలక్ట్ చేసుకోండి.
Privacy Guideపై నొక్కండి.

Read Also : Xiaomi 12 కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు