Google Maps will now allow users to search for places in Live View
Google Maps Immersive View : : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన గూగుల్ మ్యాప్స్ (Google Maps) సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. ‘ఇమ్మర్సివ్ వ్యూ’ (Immersive View) ఫీచర్. సెర్చ్, మ్యాప్స్ అంతా త్రిడి వ్యూగా మార్చాలని గూగుల్ ప్లాన్ చేస్తోంది. బుధవారం జరిగిన ఈవెంట్‌లో టెక్ దిగ్గజం ఈ విషయాన్ని ప్రకటించింది. ఇకపై వినియోగదారులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అయ్యేలా ఫీచర్ తీసుకొస్తోంది. కొత్త ఫీచర్లు సెర్చ్ రిజల్ట్స్‌లో “vibe” ద్వారా “visual forward”ని అందిస్తుంది.
Google Maps will now allow users to search for places in Live View
ఇప్పటికే అందుబాటులో ఉన్న “Around Me” అనే Google సెర్చ్ ఫీచర్‌పై “Vibe” రూపొందించింది. దాంతో యూజర్లు తమ చుట్టూ ఉన్న రెస్టారెంట్ లేదా రియల్ టైమ్ డేటా లొకేషన్ వంటి వాటిని లైవ్‌లో చూడవచ్చు. ఈ డేటా పరిసరాల్లోని స్థలాల ఫోటోలు, రివ్యూలను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు వెళ్లబోయే లొకేషన్ ముందుగానే చూడవచ్చు.Google రిలీజ్ చేయబోయే మరో పెద్ద ఫీచర్‌ను సెర్చ్ రిజల్ట్స్‌లో “visual forward” అంటారు. పేరు సూచించినట్లుగా.. ట్రావెల్ డెస్టినేషన్స్ హాలిడే స్పాట్‌ల విషయంలో యూజర్లు సెర్చ్ టెర్మ్ ద్వారా లైవ్ వ్యూ ఫీల్ పొందేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.
Google Maps will now allow users to search for places in Live View
ఈ ఫీచర్‌లో భాగంగా.. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లోని ఫోటో స్టోరీల మాదిరిగానే ఫోటోగ్రాఫ్‌లతో చేసిన టైల్స్‌ను గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో చూపుతుంది. మీరు ఏదైనా ప్రయాణ గమ్యస్థానం కోసం సెర్చ్ చేస్తే.. బ్రౌజర్ మీకు సంబంధిత లింక్‌లు, ట్రావెల్ సైట్‌లు, ఫొటోలతో పాటు గైడ్‌లను కూడా చూపిస్తుంది. కొత్త ఫీచర్లు రాబోయే కొద్ది నెలల్లో యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని చోట్ల యూజర్లు మెరుగైన సెర్చ్ ఎక్స్‌పీరియన్స్ కోసం యాక్సెస్‌ను పొందవచ్చు.
ఆ తర్వాత Google Mapsలో కొత్త Immersive View ఫీచర్ అందిస్తుంది. మొదట Google I/Oలో లాంచ్ అయింది. ఈ కొత్త ఫీచర్ యూజర్లకు సెర్చ్ చేసిన ఏరియా లేదా లొకేషన్ 3D ఏరియల్ వ్యూ అందిస్తుంది. Google ఇమ్మర్సివ్ వ్యూ ద్వారా యూజర్లకు వాతావరణం, ట్రాఫిక్, భవనాలను కూడా చెక్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ Google Maps యాప్‌లో లైవ్ వ్యూ టూల్ కూడా అందిస్తుంది.
Google Maps will now allow users to search for places in Live View
ప్రస్తుతం.. లైవ్ వ్యూ అనేది డైరెక్షన్లను చూపడానికి.. వాకింగ్ డైరెక్షన్ల వంటి డేటాను చూసేందుకు ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగిస్తుంది. కొత్త ఇమ్మర్సివ్ ఫీచర్‌తో వినియోగదారులు ఫోన్ స్క్రీన్‌పై ATMలు లేదా రెస్టారెంట్‌ల వంటి వాటిని కనుగొనవచ్చు. తద్వారా సులభమైన నావిగేషన్ ఇంటర్‌ఫేస్‌కు యాక్సెస్ పొందవచ్చు. లాస్ ఏంజిల్స్, లండన్, న్యూయార్క్ సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యోలలో రాబోయే నెలల్లో గూగుల్ ఇమ్మర్సివ్ వ్యూ (Google Maps Immersive View)ని లాంచ్ చేయనుంది. అదే సమయంలో యూజర్లు నేరుగా ఫొటోలు, టెక్స్ట్ ద్వారా సెర్చ్ చేసేందుకు Google Lens టూల్‌ను యాక్సస్ అందిస్తుంది.
Read Also : Google Maps : కొత్త ఫీచర్.. ఇకపై గూగుల్ మ్యాప్‌లోనే టోల్ ధరలు చూడొచ్చు..!