Google Pay : గూగుల్ పేలో కొత్త ఫీచర్.. యూపీఐ ట్రాన్సాక్షన్లు ఇక ఈజీ..!

Google Pay Tap to Pay : గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ పేమెంట్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. పాయింట్-ఆఫ్-సేల్ (PoS) టెర్మినల్‌లో ఫోన్‌ ట్యాప్ పేమెంట్స్ చేసుకోవచ్చు.

Google Pay Tap to Pay : గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ పేమెంట్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. పైన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యంతో భారత్‌లో UPI ట్రాన్సాక్షన్ల కోసం ట్యాప్ టు పే (Tap To Pay) ప్రారంభించినట్లు Google Pay ప్రకటించింది. మీ సమీపంలోని రిటైల్ షాపుల్లోని పాయింట్-ఆఫ్-సేల్ (PoS) టెర్మినల్‌లో నేరుగా ఫోన్‌లను ట్యాప్ చేయడం ద్వారా UPI పేమెంట్లు చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ముందుగా రిలయన్స్ రిటైల్‌తో పైలట్ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు ఫ్యూచర్ రిటైల్ స్టార్‌బక్స్‌తో సహా అన్ని రిటైల్ స్టోర్ల వద్ద అందుబాటులోకి వచ్చింది. NFC- ఆధారిత Android స్మార్ట్‌ఫోన్లు కలిగిన UPI యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ట్యాప్-టు-పే లావాదేవీల కోసం ఫంక్షనాలిటీకి పైన్ ల్యాబ్స్ ఆండ్రాయిడ్ PoS టెర్మినల్ అవసరం ఉంటుంది.

UPI ఫంక్షనాలిటీతో పనిచేసే పీఓఎస్ టెర్మినల్స్‌పై ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు తమ ఫోన్‌ను PoS టెర్మినల్‌లో ట్యాప్ చేసుకోవచ్చు. తద్వారా ఈజీగా లావాదేవీలను చేసుకోవచ్చు. UPI పిన్‌ ద్వారా ఫోన్ నుంచి పేమెంట్లను చేసుకోవచ్చు. QR కోడ్‌ స్కాన్ చేయాల్సిన పనిలేదు. UPI-లింక్ చేసిన మొబైల్ నంబర్‌‌తో అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్‌లో NFC సపోర్టు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. Apple Pay కాకుండా ఇతర సర్వీసుల ద్వారా NFC ఆధారిత పేమెంట్లను Apple సపోర్టు చేస్తుంది. Android ఫోన్‌లకు లిమిట్ వర్తిస్తుంది.

UPI పేమెంట్ల కోసం ట్యాప్ చేయడం ద్వారా అధిక ట్రాఫిక్ రిటైల్ అవుట్‌లెట్‌లకు అనేక సమస్యలు ఉన్నాయి. క్యూ నిర్వహణ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. కార్డ్‌లకు మించి POSలో డిజిటల్ పేమెంట్లను చేసుకోవచ్చు అని Google Pay నెక్స్ట్ బిలియన్ యూజర్ ఇనిషియేటివ్‌ల బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ అన్నారు.

Read Also : Google Pay అదిరే ఆఫర్.. డిజిటల్ పర్సనల్ లోన్లు ఇస్తోంది.. లక్షల్లోనే..!

ట్రెండింగ్ వార్తలు