×
Ad

Google Pixel 10 : ఇది కదా డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10పై కిర్రాక్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా రూ. 13వేలు తగ్గింపు!

Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఏకంగా రూ. 13 వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 24, 2026 / 05:15 PM IST

Google Pixel 10

  • భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10 రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్
  • ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 10పై రూ.10,019 ఫ్లాట్ డిస్కౌంట్, ధర రూ.69,890కి తగ్గింపు
  • మీరు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా

Google Pixel 10 : గూగుల్ కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి. భారత మార్కెట్లో రూ.79,999కి లాంచ్ అయిన పిక్సెల్ 10 ఫోన్ ప్రస్తుతం రూ.13వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది. క్లీన్, బ్లోట్-ఫ్రీ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, ఆకట్టుకునే కెమెరా సిస్టమ్, ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుంది.

ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో గూగుల్ పిక్సెల్ 10 గట్టి పోటినిస్తోంది. అయితే, లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆఫర్ ముగిసేలోపు కొనేసుకోవడం బెటర్. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్ ప్రస్తుతం పిక్సెల్ 10పై రూ.10,019 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.69,890కి తగ్గింది. అలాగే, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ బెనిఫిట్ పొందవచ్చు.

Read Also : Bharat Taxi Sarathi Didi : మహిళల కోసం మహిళా డ్రైవర్లు, భారత్ టాక్సీ కొత్త ‘సారథి దీదీ’ సర్వీసు.. ఇలా బుక్ చేయండి

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ పిక్సెల్ ఫోన్ 4,970mAh బ్యాటరీతో వస్తుంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఫ్రంట్ సైడ్ ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్‌తో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 10లో మాక్రో ఫోకస్‌తో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరా కూడా ఉంది.