Google Pixel 10 Series : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ వస్తోందోచ్.. మొత్తం 4 మోడల్స్.. లాంచ్, ధర వివరాలు లీక్..!

Google Pixel 10 Series : గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ అతి త్వరలో లాంచ్ కాబోతుంది. 4 మోడల్స్ రాబోతున్నాయి. లాంచ్ టైమ్, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Google Pixel 10 Series

Google Pixel 10 Series : పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గూగుల్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. గత ఏడాది మాదిరిగానే (Google Pixel 10 Series) ఈసారి కూడా గూగుల్ మొత్తం 4 మోడళ్లను ఆవిష్కరించనుంది. అందులో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఫోన్లు ఉండనున్నాయి.

ఈ కొత్త ఫోన్‌లు పర్ఫార్మెన్స్, AI ఫీచర్లు, కెమెరా క్వాలిటీ పరంగా మరిన్ని అప్‌గ్రేడ్స్‌తో రానున్నట్టు రుమర్లు వస్తున్నాయి. అయితే, గూగుల్ అధికారికంగా ఈ ఫోన్ల లాంచ్ వివరాలను వెల్లడించలేదు. లేటెస్ట్ లీక్ ప్రకారం.. యూరప్‌లో పిక్సెల్ 10 లైనప్ ధర వివరాలను రివీల్ చేసింది. రాబోయే గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ధర (అంచనా) :
నివేదికల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 10 మొత్తం 2 స్టోరేజ్ వేరియంట్‌లలో రానుంది. 128GB ధర 899 యూరోలు (రూ.90,113), 256GB ధర 999 యూరోలు (రూ.1,00,137 ఉంటుందని అంచనా. పిక్సెల్ 10 ప్రో నాలుగు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : iPhone 17 Air : అత్యంత సన్నని ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోందోచ్.. స్పెషిఫికేషన్లు, రిలీజ్ డేట్, భారత్ ధరపై భారీ అంచనాలివే..!

128GB వేరియంట్ ధర 1099 యూరోలు, 256GB వెర్షన్ ధర 1199 యూరోల వరకు ఉండవచ్చు. ఎక్కువ స్టోరేజీ కోరుకునే యూజర్లకు 512GB మోడల్ ధర 1329 యూరోలు, టాప్-టైర్ 1TB వేరియంట్ ధర 1589 యూరోలు ఉండొచ్చు.

మరోవైపు, పిక్సెల్ 10 ప్రో XL ఫోన్ 256GB వేరియంట్ ధర 1299 యూరోల నుంచి ఉండొచ్చు. 512GB మోడల్ ధర 1429 యూరోలు, 1TB వెర్షన్ ధర దాదాపు 1689 యూరోలు కావచ్చు. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ మొత్తం 3 కాన్ఫిగరేషన్లలో రావచ్చు. 256GB వేరియంట్ ధర 1899 యూరోలు. 512GB మోడల్ ధర 2029 యూరోలు, 1TB వెర్షన్ ధర 2289 యూరోల వరకు ఉండవచ్చు.

లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
గూగుల్ అక్టోబర్‌లో ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్‌లను లాంచ్ చేస్తుంది. అయితే, గత ఏడాదిలో పిక్సెల్ 9 సిరీస్ ఆగస్టులో లాంచ్ చేసింది. దీని ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.