Google Pixel 11 : ఏంది భయ్యా డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 11 భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..!
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 11 ఫోన్‌ను బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.70 వేలలోపు కొనుగోలు చేసే అవకాశం, ధర, ఫీచర్లు వివరాలివే..
- Sreehari A
- Published on- October 21, 2026 / 07:26 PM IST
Google Pixel 11 Available With Up To Rs 15,000 Discount
- పండుగ సేల్‌లో రూ.70 వేలలోపే ప్రీమియం ఫోన్
- గూగుల్ పిక్సెల్ 11పై భారీ డిస్కౌంట్ ఆఫర్
- బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్తో అదిరిపోయే డీల్
- 120Hz డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా, 7 ఏళ్ల అప్డేట్స్
Flipkart Big Billion Days Sale : పండుగల సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే గూగుల్ పిక్సెల్ 11 అతి చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గించుకోవచ్చు.. పూర్తి ఆఫర్, ధర వివరాలిపై ఓసారి లుక్కేయండి..
గూగుల్ పిక్సెల్ 11 ధర, డిస్కౌంట్ :
గూగుల్ పిక్సెల్ 11 (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) అసలు ధర రూ.89,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో (Google Pixel 11) కొనుగోలు చేస్తే రూ.10,400 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పిక్సెల్ ఫోన్ ధర రూ.79,599కు చేరుతుంది. అదనంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే వాల్యూ బట్టి మరింత బెనిఫిట్ పొందవచ్చు..
Read Also : iQOO Z11 Lite Amazon : బడ్జెట్ ధరలో పవర్ఫుల్ ఫోన్.. ఐక్యూ Z11 లైట్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్.. ఎంత చవకంటే?
ఎక్స్ఛేంజ్ ఆఫర్లో గరిష్ఠంగా రూ.73,500 వరకు వాల్యూ అందిస్తుంది. మీ పాత ఫోన్ మోడల్, కండిషన్, ఇతర అర్హతలపై ఈ వాల్యూ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. పాత ఫోన్‌కు రూ.10వేలు వాల్యూ లభిస్తే కొత్త ఫోన్ ధర రూ.69,599కు తగ్గుతుంది. అయితే, బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఇంకా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.
గూగుల్ పిక్సెల్ 11 ఫీచర్లు ఇవే :
ఈ పిక్సెల్ ఫోన్లో 6.3 అంగుళాల యాక్చువా డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. గూగుల్ టెన్సర్ G6 ప్రాసెసర్, 12GB ర్యామ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో కెమెరాతో పాటు 5x ఆప్టికల్ జూమ్ ఆప్షన్ అందిస్తుంది.
4,985mAh బ్యాటరీ, 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17తో పాటు ఏడేళ్ల వరకు సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్స్ అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.
Note : ఈ ధరలు, ఫీచర్లు కొనుగోలుకు ముందు అధికారికంగా చెక్ చేసుకోండి. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 11 మోడల్ లభ్యత, సేల్ ధర, ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌లో ఓసారి చెక్ చేయండి..
