Google Pixel 11a : గూగుల్ పిక్సెల్ 11a ఫస్ట్ లుక్ లీక్.. పర్పుల్ కలర్‌తో అదిరిపోయే డిజైన్!
Google Pixel 11a : గూగుల్ పిక్సెల్ 11a ఫోన్ 6.3-అంగుళాల (1,080 x 2,424 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. 120Hz రిఫ్రెష్ రేట్ గరిష్టంగా 2,250 నిట్స్ వరకు బ్రైట్ నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ టెన్సర్ G6 చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా.
- Sreehari A
- Published on- September 30, 2026 / 08:31 PM IST
Google Pixel 11a Design
- గూగుల్ పిక్సెల్ 11a మందపాటి బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ టెన్సర్ జి6 చిప్‌సెట్ ఉండొచ్చు
- గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్
Google Pixel 11a : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అమెరికన్ టెక్నాలజీ కంపెనీ గూగుల్ త్వరలో సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. లీక్‌ల ద్వారా గూగుల్ పిక్సెల్ 11a డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10ఎకు అప్ గ్రేడ్ వెర్షన్‌గా రాబోతుంది.
గూగుల్ పిక్సెల్ 11ఎ ఫోన్ కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్ (CAD) రెండరింగ్‌లను షేర్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ దాదాపుగా గూగుల్ పిక్సెల్ 10ఎ మాదిరిగానే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాట్ రియర్ ప్యానెల్ పైభాగంలో పిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. ఈ కెమెరా ఐలాండ్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా యూనిట్ గూగుల్ పిక్సెల్ 10ఎ కన్నా పెద్దదిగా కనిపిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 11ఎ ఫ్రంట్ సైడ్ మందపాటి బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే పైభాగంలో కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ సిల్వర్, పర్పుల్, గ్రే బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. గూగుల్ పిక్సెల్ 11ఎ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 2,250 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 6.3-అంగుళాల (1,080 x 2,424 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ టెన్సర్ జీ6 చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా..
గూగుల్ పిక్సెల్ 10ఎ ఫోన్ 6.3-అంగుళాల (1,080 x 2,424 పిక్సెల్స్) pOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ సొంత G4 చిప్‌సెట్ టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో రన్ అవుతుంది. గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఎఫ్/1.7 అపర్చర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi, బ్లూటూత్, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 5,100mAh బ్యాటరీ, 30W వైర్డ్ 10W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
