×
Ad

Google 67 Search : గూగుల్‌లో ’67’ అని సెర్చ్ చేశారా? మీ స్క్రీన్ చూసి షాకవ్వకండి.. ఇలా ఎందుకు జరిగిందంటే?

Google 67 Search : గూగుల్‌లో 67 లేదా 6-7 సెర్చ్ చేయండి.. మీ స్క్రీన్ ఏమైందో చూడండి.. నిజంగా షాక్ అయ్యారా? ఎందుకు ఇలా జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Google 67 Search

Google 67 Search : గూగుల్ యూజర్లకు ఒక సర్‌ప్రైజ్.. మీరు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ బార్‌లో 67 లేదా 6-7 అని టైప్ చేశారా? లేదంటే ఇప్పుడు ఓసారి ట్రై చేయండి.. ఏంటి షాక్ అయ్యారా? భూకంపమైనా వచ్చిందా? అనుకున్నారా? అలాంటిది ఏమి కాదండీ..

మీరు ఈ సెర్చ్ టైప్ చేసిన వెంటనే (Google 67 Search) మొత్తం గూగుల్ పేజీ అకస్మాత్తుగా కొన్ని సెకన్ల పాటు షేక్ అవుతుంది. మీ ఫోన్ లేదా డెస్క్ టాప్, ల్యాప్ టాప్ హ్యాంగ్ అయినట్లు అనిపించవచ్చు. కంగారు పడొద్దు.. ఇదంతా గూగుల్ మ్యాజిక్ అంతే..

మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఎలాంటి టెక్నాలజీ లోపం లేదు. కానీ, మీరు ఇలా టైప్ చేస్తే మీ డివైజ్ స్క్రీన్ షేక్ అవుతుంది.. వాస్తవానికి ఇది బగ్ కాదు.. గూగుల్ సరదాగా యాడ్ చేసిన ఈస్టర్ ఎగ్. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “6-7” లేదా “67” ట్రెండ్‌ కోసం గూగుల్ ఈ స్క్రీన్-షేక్ ఎఫెక్ట్‌ను చేర్చింది అంతే..

67 లేదా 6-7 ట్రెండ్ ఏంటి? :
ఈ 67 ట్రెండ్ అనేది ఫిలడెల్ఫియా రాపర్ స్క్రిల్లా 2024 పాట “డూట్ డూట్ (6 7)” తో ఉద్భవించింది. ఈ పదాలకు మొదట్లో అసలు అర్థమే లేదు. కానీ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎన్బీఏ ప్లేయర్ లామెలో బాల్ (6 అడుగుల 7 అంగుళాల పొడవు) దీనికి లింక్ చేయడంతో ఈ ట్రెండ్ మరింత వైరల్ అయింది.

Read Also : Best Flagship Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. 2025లో 5 బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు.. ఈ ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

ఒక్క మాటలో చెప్పాలంటే.. దీన్ని గూగుల్ ఇయర్ ఎండ్ కోసం సరదాగా ఆవిష్కరించింది. 2025 ఏడాది బట్టి 6-7 అనే పదాన్ని పాపులారిటీ అంచనా వేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఎంటైర్మెంట్ సోషల్ మీడియా ఎంగేజ్ మెంట్ కోసం మాత్రమే ఉద్దేశించింది.

ఈ ఎఫెక్ట్ నచ్చకపోతే ఇలా చేయండి :
మీకు గూగుల్ స్క్రీన్-షేక్ ఎఫెక్ట్ నచ్చకపోతే. ఇలా తొలగించవచ్చు. మీ బ్రౌజర్‌ను రిఫ్రెష్ చేయండి. లేదా బ్యాక్ బటన్‌ను ట్యాప్ చేయండి. స్క్రీన్ ఆటోమాటిక్‌గా నార్మల్ అవుతుంది.