Hackers Target : ఐటీ సంస్థలను టార్గెట్ చేసిన ఇరాన్ హ్యాకర్లు ?

భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై "ఎక్కువగా దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు వెల్లడించింది.

Iran

Indian IT Firms : గత కొంత కాలం క్రితం చైనా హ్యాకర్లు ఇండియాలోని కొన్ని సంస్థలను హ్యాక్ చేయగా.. ఇప్పుడు ఇరాన్‌ హ్యాకర్లు భారత్‌లోని ఐటీ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. భారత్‌లోని ఐటీ సేవల సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నట్లు ఐటీ సంస్థలను హెచ్చరించింది. జూలై 2021కి ముందు దేశంలో ఉన్న చిన్న కంపెనీలను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు ఇప్పుడు టెక్ దిగ్గజ కంపెనీలను సిద్దం అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. గతంతో పోలిస్తే దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు వెల్లడించింది.

Read More : YRF Entertainment: యశ్‌రాజ్ భారీప్లాన్.. సల్మాన్, షారుఖ్, హృతిక్‌తో వెబ్ సిరీస్!

2021లో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న 40 కంటే ఎక్కువ ఐటీ కంపెనీలకు 16 వందల నోటిఫికేషన్‌లను జారీ చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. 2020లో కంపెనీ జారీ చేసిన 48 నోటిఫికేషన్‌ల కంటే ఇది చాలా ఎక్కువని పేర్కొంది. ఇరానియన్ హ్యాకర్ల దృష్టి ముఖ్యంగా గత ఆరు నెలల్లో పుంజుకున్న ఐటీ రంగం మీద ఉందని వెల్లడించింది.

Read More : మీ రాజకీయాల కోసం ఆడవాళ్లను వాడుకుంటారా.! _ Lokeswari reacts on Chandrababu Incident

తమ నోటిఫికేషన్‌లలో దాదాపు 10నుంచి 13శాతం గత ఆరు నెలల్లో ఇరాన్‌ హ్యాకర్లకు సంబంధించినవేనని తెలిపింది. అంతకు ముందు ఆరు నెలల్లోని రెండున్నర శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని కంపెనీ వెల్లడించింది.ఈ హ్యాకర్లు ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో పాటు భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై “ఎక్కువగా దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.