Happy Diwali 2026 : వాట్సాప్‌లో దీపావళి విషెస్ కొత్తగా చెప్పాలా? ChatGPT, Gemini AIతో మీ ఫొటోలనే స్టిక్కర్లుగా మార్చేయండి!

Happy Diwali 2026 : దీపావళి 2026 సందర్భంగా మీ ఫొటోలతోనే ప్రత్యేకమైన వాట్సాప్ స్టిక్కర్లు రెడీ చేసుకోవాలా? ChatGPT, Google Gemini ఏఐ టూల్స్‌తో స్టిక్కర్లు ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

Happy Diwali 2026

  • మీ ఫొటోలతో వాట్సాప్‌లో అదిరిపోయే స్టిక్కర్లు
  • దీపావళికి మీ ఫొటోలతో పర్సనల్ స్టిక్కర్లు.. ఈ ఏఐ ట్రిక్ తెలిస్తే చాలు
  • ChatGPT, Geminiలో మీ ఫొటోనే స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు..

Happy Diwali 2026 : దీపావళి వచ్చిందంటే ఇంటిల్లిపాదీ సందడే సందడి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, దీపాల వెలుగులు, పూజలు, పిండి వంటలు.. ఇలా పండుగ వాతావరణం అంతా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక పండుగ రోజు స్నేహితులు, బంధువులకు వాట్సాప్‌లో శుభాకాంక్షలు పంపడం కూడా కామన్..

అయితే, ప్రతిసారీ అవే గ్రీటింగ్ ఫొటోలు పంపకుండా ఈసారి కాస్త కొత్తగా ట్రై చేయొచ్చు. మీ ఫొటోలతో మీరే స్పెషల్ దీపావళి స్టిక్కర్లు క్రియేట్ చేసుకోవచ్చు. అదెలాగంటే ChatGPT, Google Gemini వంటి ఏఐ టూల్స్‌తో చాలా ఈజీగా ఉంటాయి..

చాట్‌జీపీటీతో స్టిక్కర్లు రెడీ ఎలాగంటే? :

  • ముందుగా మీ ఫోన్‌లో ChatGPT ఓపెన్ చేయాలి.
  • అందులో ప్లస్ (+) గుర్తుపై క్లిక్ చేసి మీకు నచ్చిన ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
  • ఆ తర్వాత ఆ ఫొటోను దీపావళి స్టిక్కర్‌గా మార్చమని ప్రాంప్ట్ ఇవ్వాలి.

ఉదాహరణకు.. ‘నా ఫొటోను అందమైన దీపావళి వాట్సాప్ స్టిక్కర్‌గా మార్చు. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అలాగే ఉంచి, ట్రెడిషినల్ డ్రెస్సు, స్మాల్ ల్యాంప్, ఫ్లవర్ డెకరేషన్ యాడ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ ట్రాన్స్ పరెంట్ ఉండేలా క్రియేట్ చేయమని’ అని అడగొచ్చు. మీరు చెప్పినట్టు ఏఐ ఇమేజ్ రెడీ చేస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Read Also : Happy Diwali Gifts 2026 : దీపావళి గిఫ్ట్స్ ఇంకా కొనలేదా? బ్లింకిట్, జెప్టోలో ఈ 5 గ్యాడ్జెట్స్ రెడీ.. క్షణాల్లో ఇంటికే డెలివరీ..!

ఇదిగో ప్రాంప్ట్ : 

Transform my photo into a beautiful Diwali WhatsApp sticker. Keep my original facial features and facial expressions exactly the same. Add a traditional Indian outfit, a small decorative Diya lamp, and elegant floral decorations. Use vibrant festive colors and a beautiful Diwali theme. Make the background completely transparent (PNG format) so it can be used as a WhatsApp sticker.

జెమిని ఏఐతో ఇదే మ్యాజిక్.. :
గూగుల్ జెమిని యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన స్టిక్కర్ వివరాలను ప్రాంప్ట్‌లో ఇవ్వాలి. ఫేస్, హెయిర్ స్టైల్, నేచురల్ స్కిన్ టోన్ మారకుండా చూడాలని ప్రత్యేకంగా చెప్పొచ్చు. అలాగే రంగోలి, దీపాలు, పండుగ అలంకరణలు యాడ్ చేయమని అడగవచ్చు. ఇమేజ్ రెడీ అయిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి..

వాట్సాప్‌లో ఎలా పంపాలి? :
డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ను వాట్సాప్‌లోని స్టిక్కర్ మేకర్ ద్వారా స్టిక్కర్‌గా మార్చి ఫ్రెండ్స్‌కు పంపొచ్చు. కొన్ని ఫోన్లలో అదనపు స్టిక్కర్ యాప్ అవసరం కావచ్చు. ఇలా మీ ఫొటోలతో క్రియేట్ చేసిన స్టిక్కర్లు పంపి దీపావళి శుభాకాంక్షలు చెప్పొచ్చు.. అయితే, ఏఐ క్రియేట్ చేసిన ఫొటోల్లో ముఖంలో చిన్నచిన్న మార్పులు రావచ్చు. కాబట్టి స్టిక్కర్‌ను ఒకసారి పరిశీలించాకే షేర్ చేయండి..