U Go
U Go Electric Scooter : ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. పలు కంపెనీలు ఆకర్షణీయమైన రంగులు, కొత్త హంగులతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా..‘యు..జీవో’ పేరిట..తక్కువ ధరలో హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. లైట్ వెయిట్ ఈ స్కూటర్ రెండు వెర్షన్ లో తీసుకొచ్చారు. స్టాండర్డ్ మోడల్ 1.2kw హబ్ మోటార్ రూపొందించారు. దీని గరిష్ట వేగం 53 కిలోమీటర్లు. లోయర్ స్పీడ్ మోడల్ 800kw. హబ్ మోటార్, 1.2kw గరిష్ట పవర్ తో పనిచేయనుంది.
Read More : Samsung Galaxy : శాంసంగ్ బిగ్ ఈవెంట్.. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, వాచ్, ఇయర్‌బడ్స్ లాంచ్ నేడే!
దీని గరిష్ట వేగం 43 కిలోమీటర్లు. రెండు మోడల్ 1.44kwh సామర్థ్యం కలిగిన 48v, 30ah గల లిథియం – అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లేలో రైడర్ వేగం, దూరం, ఛార్జ్ వంటి కీలకమైన సమాచారంతో పాటు ఇతర వివరాలు కనిపించనున్నాయి. యుజీవో 12 అంగుళాల ఫ్రంట్, 10 అంగుళాల రియర్ అలాయ్ చక్రాలతో వస్తుంది. ఇందులో 26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ కెపాసిటీ ఉంది. ముందు భాగంలో ట్రిపుల్ బీమ్ LED హెడ్ లైట్, ప్రధాన క్లస్టర్ చుట్టూ LED DRL స్ట్రిప్ ఉంది.
Read More : Samsung Galaxy : శాంసంగ్ బిగ్ ఈవెంట్.. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, వాచ్, ఇయర్‌బడ్స్ లాంచ్ నేడే!
యు – జీవో మోడల్ ధర రూ. 7 వేల 499 ఆర్ఎంబి (సుమారు రూ. 85 వేల 342). ప్రామాణిక మోడల్ ధర రూ. 7 వేల 999 ఆర్ఎంబీ (సుమారు 91 వేల 501)గా ఉంది. హోండా యు జీవో భారతీయ మార్కెట్ లో విడుదల అయితే..రాబోయే ఓలా ఈ స్కూటర్ వంటి వాటితో పోటీ పడనుంది.