Honor Win Turbo 2 : కొత్త హానర్ విన్ టర్బో2 చూశారా? 12070mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదుర్స్, ధర జస్ట్..!
Honor Win Turbo 2 : హానర్ నుంచి కొత్త ఫోన్ ఆగయా.. విన్ టర్బో 2 భారీ బ్యాటరీతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది. 12070mAh బ్యాటరీ, 50MP కెమెరా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఫీచర్లు, ధర వివరాలివే..
- Sreehari A
- Published on- October 21, 2026 / 05:44 PM IST
Honor Win Turbo 2
- 12,070mAh భారీ బ్యాటరీతో హానర్ విన్ టర్బో2 ఫోన్
- 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,199 యువాన్లు
- 6.89-అంగుళాల 2K OLED డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్
Honor Win Turbo 2 : హానర్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. అదే హానర్ విన్ టర్బో2 ఫోన్.. IP68, IP69, IP69K రేటింగ్‌లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ మ్యాజిక్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
ఈ హానర్ ఫోన్లో 12,070mAh భారీ బ్యాటరీ కూడా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా (Honor Win Turbo 2) ఉన్నాయి. హానర్ విన్ టర్బో2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..
హానర్ విన్ టర్బో2 ధర ఎంతంటే? :
హానర్ విన్ టర్బో2 ధర 8GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు 3,199 యువాన్లు (సుమారుగా రూ.45,309), 12GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు 3,499 యువాన్లు (సుమారుగా రూ.49,560), 16GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు 3,899 యువాన్లు (సుమారుగా రూ.55,225), 12GB+512GB స్టోరేజ్ వేరియంట్‌కు 4,199 యువాన్లు (సుమారుగా రూ.59,470), 16GB+512GB స్టోరేజ్ వేరియంట్‌కు 4,499 యువాన్లు (సుమారుగా రూ.63,620)గా ఉంది. ఈ ఫోన్ చైనా మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉంది. రెడ్ అండ్ బ్లూ బఫ్, డెసిగ్నేటెడ్ విన్, క్విక్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
హానర్ విన్ టర్బో2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హానర్ విన్ టర్బో2లో 185Hz రిఫ్రెష్ రేట్, 10,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.89-అంగుళాల 2K ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే టీయూవీ రైన్‌ల్యాండ్ గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 6.0, ఫ్లికర్-ఫ్రీ ద్వారా అందిస్తుంది. ఈ డిస్ప్లే డైనమిక్ డీఫోకస్ స్మూతింగ్, 3డీ యాంటీ-డిజ్జినెస్ ప్రాసెసింగ్, లో-లైట్ గేమింగ్ బ్యాలెన్స్ మోడ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది. కూలింగ్ కోసం ఫ్యాన్‌లెస్ ఆర్కిటెక్చర్ అందిస్తుంది. ఇందులో 12,070mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68/IP69/IP69K రేటింగ్ కూడా అందిస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
హానర్ విన్ టర్బో2 బ్యాక్ సైడ్ OIS సపోర్ట్, CIPA 6.0తో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ మ్యాజిక్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఆడియో కోసం ఇందులో డ్యూయల్ 1216 ఉంది. ఈ ఫోన్లో ఇండిపెండెంట్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉంది. సేఫ్టీ కోసం 3డీ అల్ట్రాసోనిక్ అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ అందిస్తుంది.
