Honor X30 Features Leak : లాంచింగ్ ముందే ఫీచర్లు లీక్.. ట్రిపుల్ కెమెరాలు అదుర్స్!

Honor బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. అదే.. Honor X30 కొత్త స్మార్ట్ ఫోన్.. ఈ కొత్త ఫోన్ అధికారికంగా డిసెంబర్ 16న చైనా మార్కెట్లోకి రానుంది.

Honor X30 Teased To Come With Circular Camera Module With Triple Cameras, Hands On Images, Specifications Leak

Honor X30 Features Leak : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Honor బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. అదే.. Honor X30 కొత్త స్మార్ట్ ఫోన్.. ఈ కొత్త ఫోన్ అధికారికంగా డిసెంబర్ 16న చైనా మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే లాంచింగ్ ముందు రోజే Honor X30 ఫీచర్లు లీకయ్యాయి. అంతకముందు హానర్ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఫొటోలను టీజ్ చేసింది. కొన్ని స్పెషిఫికేషన్లను కూడా రివీల్ చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో హోల్ ఫంచ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇదివరకే హానర్ కంపెనీ తమ కొత్త ప్రొడక్ట్ Honor X30 మూడు కలర్ వేరియంట్ ఆప్షన్లలో రాబోతుందని వెల్లడించింది. మరోవైపు.. Tipsters రాబోయే కొత్త హ్యాండ్ సెట్ కు సంబంధించి కీలక స్పెషిఫికేషన్లను లీక్ చేసింది. దీని ప్రకారం.. Snapdragon 695 చిప్ సెట్ కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

హానర్ అధికారిక Weibo అకౌంట్లలో ఒకటైన హానర్ క్లబ్.. Honor X30 హ్యాండ్‌సెట్ బ్లూ, రోజ్ గోల్డ్ లేదా వైట్ గోల్డ్ కలర్స్‌లో వస్తుందని ఫొటోలు రిలీజ్ చేసింది. సెల్ఫీ షూటర్‌తో ఫోన్ హోల్-పంచ్ డిస్‌ప్లే డిజైన్‌ కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ వెనుక కెమెరాలు సర్య్కూలర్ మాడ్యూల్‌తో ఉన్నట్టు కనిపిస్తుంది.

LED ఫ్లాష్‌తో పాటు మూడు సెన్సార్లు కూడా ఉన్నాయి. Honor X30లో సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. హానర్ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ 48-MP మెయిన్ సెన్సార్, రెండు 2-MP సెన్సార్‌లను కలిగి ఉండనుంది. Honor X30 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుందని భావిస్తున్నారు. Honor X30 స్మార్ట్ ఫోన్.. డిసెంబర్ 16న చైనా మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ఇప్పటికే హానర్ ప్రకటించింది.

Read Also : Android 12 Go Edition : ఆండ్రాయిడ్ 12గో ఎడిషన్ OS వచ్చేస్తోంది.. ప్రైవసీ కంట్రోల్, బ్యాటరీ లైఫ్.. కొత్త ఫీచర్లు!