Honor X80 Pro Max : 11,000mAh భారీ బ్యాటరీతో హానర్ పవర్‌ఫుల్ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..

Honor X80 Pro Max : హానర్ X80 ప్రో మ్యాక్స్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మిడ్-రేంజ్ X80 లైనప్‌లో 11,000mAh బ్యాటరీతో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ముందుగానే ఫీచర్లు లీక్ అయ్యాయి..

Honor X80 Pro Max

  • 11,000mAh బ్యాటరీతో పవర్ ఫుల్ హానర్ ఫోన్ వచ్చేస్తోంది
  • 12GB వరకు ర్యామ్‌, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌
  • 6.8-అంగుళాల డిస్‌ప్లే, 8MP ఫ్రంట్ కెమెరా సెటప్
  • ఆండ్రాయిడ్ 16 మ్యాజిక్‌ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్

Honor X80 Pro Max : కొత్త హానర్ ఫోన్ వచ్చేస్తోంది. హానర్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ X80 ప్రో మ్యాక్స్‌ అతి త్వరలో చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ మిడ్-రేంజ్ X80 లైనప్‌లో మరో కొత్త ఫోన్ చేరనుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 11,000mAh బ్యాటరీతో వస్తుందని టెక్ దిగ్గజం ధృవీకరించింది. కంపెనీ లైనప్‌లోనే అతిపెద్ద మోడల్ అని సమాచారం.

లాంచ్ కొద్ది రోజుల ముందే హానర్ X80 ప్రో మ్యాక్స్ చైనా టెలికాం వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. తద్వారా కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, 4 కలర్ ఆప్షన్ల, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్‌ ఉంటుందని అంచనా. ఈ హానర్ ఫోన్ బరువు సుమారుగా 203 గ్రాములు ఉంటుందని అంచనా.

స్పెసిఫికేషన్లు, స్టోరేజ్ ఆప్షన్లు (అంచనా) :
చైనా టెలికాం వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం.. రాబోయే హానర్ X80 ప్రో మ్యాక్స్ 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB, 8GB + 512GB, 12GB + 512GB ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. చైనా టెలికాం వెబ్‌సైట్‌లో హానర్ X80 ప్రో మ్యాక్స్ క్వాల్‌కామ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌తో లిస్ట్ అయింది. ఈ చిప్‌సెట్ 2.6GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందిస్తుందని అంచనా.

Read Also : LG French Door Refrigerators : వావ్..! LG నుంచి కొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు.. ఇక 24 గంటలూ ఐస్ రెడీ.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

ఈ లిస్టింగ్ ప్రకారం.. రాబోయే హానర్ స్మార్ట్‌ఫోన్‌లో 6.8-అంగుళాల డిస్‌ప్లే ఉం టుందని వెల్లడైంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండవచ్చు. అంతేకాదు.. హానర్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10 పై రన్ అవుతుందని భావిస్తున్నారు. ఫోన్ కొలతలు 162.2×77×8.08mm బరువు సుమారుగా 203 గ్రాములు ఉంటుందని చెబుతున్నారు.

ఇందులో డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్, NFC, అలాగే యూఎస్‌బీ టైప్-C పోర్ట్ కూడా ఉంటాయని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 22న చైనాలో సాయంత్రం 7:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం) సాయంత్రం 4:30 గంటలకు (IST) లాంచ్ కానుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

ఈ హ్యాండ్‌సెట్‌లో 11,000mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుందని కూడా కంపెనీ ధృవీకరించింది. డిస్‌ప్లే గరిష్టంగా 10,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుందని అంచనా.

ఈ హానర్ X80 ప్రో మ్యాక్స్ ఫోన్‌లో రౌండెడ్ కెమెరా ఐలాండ్‌లో సింగిల్ 50MP రియర్ కెమెరా, LED ఫ్లాష్ ఉంటాయి. చైనాలో లైట్నింగ్ రెడ్, మూన్‌లైట్ వైట్, మిస్టిక్ బ్లాక్ వైబ్రెంట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లో లాంచ్ కానుందని హానర్ వెల్లడించింది. డిజైన్ పరంగా చూస్తే.. ఫోన్ మధ్యలో హోల్-పంచ్ డిస్‌ప్లే కటౌట్ ఉంటుంది. పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఫోన్ రైట్ సైడ్ ఉంటాయి.