OPPO Reno 15c : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. ఈ ఒప్పో ఫోన్ చాలా చీప్ గురూ.. ఈ డీల్ అస్సలు వదులుకోవద్దు!
OPPO Reno 15c Price : ఒప్పో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. 50MP ప్రైమరీ కెమెరాతో ఒప్పో రెనో 15సీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఇలా కొన్నారంటే రూ. 5వేలు తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
OPPO Reno 15c Price
- రెనో 15c 5జీ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా సెటప్
- 7,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్
- కలర్ఓఎస్ 16, 120Hz రిఫ్రెష్ రేట్ 1400 నిట్స్
OPPO Reno 15c Price : కొత్త ఒప్పో ఫోన్ కొంటున్నారా? ఒప్పో రెనో 15C భారీ తగ్గింపుతో లభిస్తోంది. కంపెనీ ఒప్పో రెనో 15C ఫోన్ గత జనవరిలో లాంచ్ చేయగా అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీ ఉంది.
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అసలు ధర కన్నా (OPPO Reno 15c) తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ధరతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఒప్పో రెనో 15C బెస్ట్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
ఒప్పో రెనో 15C సేల్ ధర తగ్గింపు :
ఈ ఒప్పో ఫోన్ తగ్గింపు ధరకు లభిస్తోంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,999కు లభిస్తుంది. అయితే, విజయ్ సేల్స్ ఈ ఫోన్‌పై 2శాతం తగ్గింపు అందిస్తుంది. తద్వారా రూ. 1,000 తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్ నేరుగా రూ. 41,999కే సొంతం చేసుకోవచ్చు. విజయ్ సేల్స్ ఈ ఫోన్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
ఒప్పో రెనో 15C సేల్ బ్యాంక్ ఆఫర్ :
ఈ ఒప్పో ఫోన్ బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎమ్ఐలో ఫోన్ కొంటే రూ. 4,200 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్‌పై అసలు డిస్కౌంట్ రూ. 5,200కు పొందవచ్చు.
Read Also : Happy Father’s Day : ఫాదర్స్ డే స్పెషల్: మీ నాన్నకు ఎప్పటికీ గుర్తుండే టాప్ 5 బెస్ట్ గాడ్జెట్ గిఫ్ట్స్!
ఒప్పో రెనో 15C స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 15C ఫోన్ 2372×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.57-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత కలర్ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
ఒప్పో రెనో 15C 5G ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
ఈ ఫోన్లో 7,000mAh బ్యాటరీ అమర్చారు. 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కొలతల పరంగా ఈ ఫోన్ 158.18 మిమీ పొడవు, 74.93 మిమీ వెడల్పు, 8.14 మిమీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.
