×
Ad

Happy Diwali Stickers : వాట్సాప్‌లో ‘హ్యాపీ దీపావళి స్టిక్కర్లు’ ఎలా క్రియేట్ చేయాలి? డౌన్‌‌లోడ్ చేసి ఇప్పుడే స్టేటస్ పెట్టుకోండి..!

Happy Diwali Stickers : దీపావళి పండగ శుభాకాంక్షల కోసం వాట్సాప్ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు..

Happy Diwali Stickers

Happy Diwali Stickers : దీపావళి పండగ వచ్చేసింది. దేశవ్యాప్తగా పండగ సందడి మొదలైంది. ఈ దీపావళి సందర్భంగా ప్రతిఒక్కరూ తమ ప్రియమైనవారికి గ్రీటింగ్స్, హ్యాపీ దీపావళి అంటూ విషెస్ పంపుతుంటారు. అందులో ప్రధానంగా వాట్సాప్ ద్వారా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు.

మీరు కూడా వాట్సాప్ ద్వారా దీపావళి విషెస్ తెలిపాలని (Happy Diwali Stickers) అనుకుంటున్నారా? అయితే మీకోసం వాట్సాప్‌లో అద్భుతమైన స్టిక్కర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు స్టిక్కర్ల సాయంతో దీపావళి శుభాకాంక్షలను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంతకీ హ్యాపీ దీపావళి స్టిక్కర్‌లను వాట్సాప్‌లో ఏయే మార్గాల్లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వాట్సాప్‌లో హ్యాపీ దీపావళి స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా? :

  • ముందుగా, మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి స్టిక్కర్ పంపాలనుకునే వారి చాట్‌కి వెళ్లండి.
  • మీరు ఎమోజి ఐకాన్ ట్యాప్ చేసి ఆపై దిగువన స్టిక్కర్ ఐకాన్ ఎంచుకోవాలి.
  • ఇప్పుడు, ప్లస్ (+) బటన్‌పై ట్యాప్ చేయండి. ఆపై స్టిక్కర్ స్టోర్‌కి వెళ్లండి.
  • మీరు హ్యాపీ దీపావళి స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయాలి.
  • మీకు బాగా నచ్చిన ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • చాట్‌లలో సౌలభ్యం ప్రకారం ఏవైనా స్టిక్కర్‌లను వాడుకోవచ్చు.

Note : మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి కూడా స్టిక్కర్ ప్యాక్‌లను పొందవచ్చు. మీరు డౌన్‌లోడ్ చేసే యాప్ లీగల్ అయి ఉండాలి. బ్లోట్‌వేర్ లేదా యాడ్ మెషిన్ టైప్ అప్లికేషన్ వాడొద్దు.

వాట్సాప్‌లో హ్యాపీ దీపావళి స్టిక్కర్‌లను ఎలా క్రియేట్ చేయాలి? :

  • ఈ దీపావళికి మీ ప్రియమైనవారి కోసం మీ సొంత స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు.
  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి ఆపై (Meta AI)తో చాట్ చేయండి.
  • ఇక్కడ, హ్యాపీ దీపావళి స్టిక్కర్ల కోసం ప్రాంప్ట్‌ను టైప్ చేయండి.
  • ప్రాంప్ట్ చాలా సింపుల్ గా ఉండాలి ‘Generate a sticker wishing happy Diwali, showing diyas and crackers.’
  • ఆ తర్వాత, మీకు కొన్ని సెకన్లలో మీ స్టిక్కర్ జనరేట్ అవుతుంది. మీ ప్రియమైనవారికి పంపవచ్చు.
  • ప్రతి ఒక్కరికీ కొత్త స్టిక్కర్లను జనరేట్ చేసేందుకు మీకు నచ్చిన విధంగా ప్రాంప్ట్‌లను ట్రై చేయొచ్చు.