How to reset SBI YONO username and password online
SBI YONO : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యూజర్ల కోసం డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌గా YONO (You Only Need One)ని ప్రారంభించింది. నెట్ బ్యాంకింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఓపెన్ ట్రాన్సాక్షన్ల హిస్టరీని చూసుకోవచ్చు. విమానాలు, రైళ్లు, బస్సులు, టాక్సీలను బుకింగ్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్, మెడికల్ బిల్లులు చెల్లించడం, మరిన్నింటితో సహా వివిధ రకాల ఆర్థిక, ఇతర సర్వీసులను అందించే వెబ్‌సైట్, యాప్ ద్వారా YONO అందుబాటులో ఉంటుంది. మీరు Play Store లేదా App Store నుంచి మీ Android లేదా iOS ఫోన్ కోసం YONO యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SBI వినియోగదారులందరూ తమ అకౌంట్ వివరాలను ఉపయోగించి YONOని సెటప్ చేయవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత, యాప్‌కి మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ని యాడ్ చేయడం ద్వారా మీరు మీ అకౌంట్లో లాగిన్ చేయవచ్చు. అయితే, YONO SBI యాప్‌ని యాక్సెస్ చేయడానికి మీరు మీ అకౌంట్లో లాగిన్ అయిన ప్రతిసారీ ఈ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ప్రైవసీ బెనిఫిట్స్ కోసం SBI లాగిన్ ప్రాసెస్‌ను పొందవచ్చు. కానీ, కొన్నిసార్లు యూజర్లు వారి వినియోగదారు పేరు లేదా పాస్‌వర్డ్‌ను మరిచిపోవచ్చు. వారి అకౌంట్లో లాగిన్ చేయలేరు. మీరు మీ YONO లాగిన్ క్రెడెన్షియల్‌ను కూడా మరిచిపోయారా? మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ని రీసెట్ చేసేందుకు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
How to reset SBI YONO username and password online
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారిక వెబ్‌సైట్ onlinesbi.comని విజిట్ చేయండి.
* పర్సనల్ బ్యాంకింగ్ విభాగం కింద లాగిన్ ఆప్షన్‌పై Tap చేయండి.
* మీ అకౌంట్ వివరాలను నింపాల్సి ఉంటుంది.
* అందుకు బదులుగా మీరు Forget Username/Login Password’పై Click చేయండి.
* ఒక పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
* డ్రాప్-డౌన్ మెను నుంచి “forgot my username” ఆప్షన్ ఎంచుకుని, ఆపై “Next” బటన్‌పై క్లిక్ చేయండి.
* CIF నంబర్, Country, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, Captcha Code వంటి అవసరమైన ఫీల్డ్‌లను నింపండి.
* Submit బటన్‌పై నొక్కండి.
* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని రిజిస్టర్ చేసి, Confirm బటన్‌పై నొక్కండి.
* మీ కొత్త YONO SBI యూజర్ నేమ్ స్క్రీన్‌పై పొందవచ్చు. మీరు అదే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ టెక్స్ట్‌ను కూడా పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : SBI Users FASTag : ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. FASTag బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు..!