Huawei Nova 16 SE Leak : బ్యాటరీ కింగ్ వస్తోంది.. కొత్త హువావే నోవా 16 SE అదుర్స్.. కీలక ఫీచర్లు లీక్..!

Huawei Nova 16 SE Leak : ఈ హువావే స్మార్ట్‌ఫోన్‌లో 8,500mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, రెండు కలర్ రియర్ ప్యానెల్‌తో హానర్ పవర్ 2 మాదిరిగా ఉంటుందని అంచనా.

Huawei Nova 16 SE Leak

  • హువావే నోవా 16SEలో LTPS OLED ఫ్లాట్ డిస్‌ప్లే అంచనా
  • ఈ స్మార్ట్‌ఫోన్ కిరిన్ 8020 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది
  • రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 8,500 mAhబ్యాటరీ ఉండొచ్చు

Huawei Nova 16 SE Leak : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? హువావే అభిమానుల కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది. చైనాకు హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ హువావే త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. గత నెలలో హువావే నోవా 16 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మార్కెట్లో హువావే నోవా 16, నోవా 16z, నోవా 16 ప్రో, నోవా 16 అల్ట్రా ఫోన్లు ఉండగా ఈ సిరీస్‌కు హువావే నోవా 16 SE కూడా కొత్తగా చేరనుంది.

నివేదిక ప్రకారం.. హువావే నోవా 16 SE ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ కిరిన్ 8020 చిప్‌సెట్‌తో రన్ అవుతుందని అంచనా. హువావే నోవా 16 SE రియర్ కెమెరా సెటప్‌లో రెడ్ మేపుల్ ఇమేజింగ్ టెక్నాలజీతో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా.

రాబోయే హువావే స్మార్ట్‌ఫోన్‌లో 8,500mAh బ్యాటరీ ఉండొచ్చు. హువావే నోవా 16 SE ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ హానర్ పవర్ 2 మాదిరిగానే ఉంది. మెరిసే డ్యూయల్-షేడ్ రియర్ ప్యానెల్ ఉంది.

హువావే నోవా 16ఎస్ఈ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు : 
హువావే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంకా వెరిఫై చేయలేదు. గత నెలలో లాంచ్ అయిన హువావే నోవా 16లో 6.68-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే (1,280 x 2800 పిక్సెల్స్) ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

Read Also : Family Register Certificate : ఇక ప్రతి కుటుంబానికీ ఒకే గుర్తింపు! తెలంగాణలో ‘ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌’కు శ్రీకారం!

ఈ స్మార్ట్‌ఫోన్ కిరిన్ 9010S చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. హువావే నోవా 16 ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో ఎఫ్/1.9 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.6 అపర్చర్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

వచ్చే సెప్టెంబర్‌లో హువావే మేట్ 90 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా. ఈ సిరీస్‌తో హువావే మేట్ XT 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. గత ఏడాదిలో హువావే మేట్ 80 సిరీస్‌తో పాటు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ప్రవేశపెట్టింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ ద్వారా మార్కెట్లో షావోమీ 18 సిరీస్, ఐక్యూ 16లతో నేరుగా పోటీ పడనుంది.