Infinix GT 10 Series Flipkart : ఇన్ఫినిక్స్ GT 10 సిరీస్ ఫోన్ వస్తోంది.. భారత్‌లో లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ ఇదిగో..!

Infinix GT 10 Series Flipkart : ఇన్ఫినిక్స్ GT 10 ప్రో సిరీస్.. నథింగ్ ఫోన్ నుంచి కాన్సెప్ట్‌ను తీసుకుంది. అయితే, ప్రత్యేకమైన సైబర్ మెకా డిజైన్‌ను కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ అందుబాటులో ఉంటుంది.

Infinix GT 10 Series Flipkart availability confirmed ahead of India launch

Infinix GT 10 Series Flipkart : కొత్త Infinix GT 10 సిరీస్ భారత మార్కెట్లో త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త టీజర్ కనిపించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లీక్‌ల ప్రకారం.. వచ్చే ఆగస్ట్‌లో Infinix GT 10 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. రాబోయే వారాల్లో మిడ్-రేంజ్ డివైజ్ కూడా భారత్‌కు వస్తుందని భావిస్తున్నారు.

దీనితో పాటు, ఇన్ఫినిక్స్ GT 10 Pro ప్లస్ కూడా లాంచ్ కానుంది. అయితే, భారత మార్కెట్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఇన్ఫినిక్స్ GT 10 ప్రో నథింగ్ ఫోన్ కాన్సెప్ట్‌ ద్వారా వచ్చింది. అయితే, ప్రత్యేకమైన సైబర్ మెకా డిజైన్‌ను కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో ఉన్నాయి. సైబర్ బ్లాక్ వేరియంట్ బ్రైట్‌నెస్ ఆరెంజ్ కలిగి ఉంది. అయితే, మిరాజ్ సిల్వర్ వేరియంట్ UV లైట్ కింద కలర్ మార్చే బ్యాక్ ప్యానెల్‌తో రానుంది.

Read Also : PhonePe Income Tax Payment : ఫోన్‌పే‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై, మీ ఆదాయ పన్నును నేరుగా యాప్ నుంచే చెల్లించవచ్చు..!

ఇన్పినిక్స్ GT 10 Pro స్పెక్స్, ఫీచర్లు లీక్ :
ఈ ఇన్పినిక్స్ ఫోన్ 256GB స్టోరేజీ, 16GB RAMని అందిస్తుంది. లీక్‌ల ప్రకారం.. MediaTek డైమెన్సిటీ 8050 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. హుడ్ కింద, ఇటీవలి లీక్ పరిశీలిస్తే.. భారీ 7,000mAh బ్యాటరీ ఉండవచ్చని పేర్కొంది. అయినప్పటికీ, కొన్ని నివేదికల్లో 5,000mAh యూనిట్ ఇంటర్నల్‌గా ఉండవచ్చు. Infinix GT సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అయితే.. దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కంపెనీ 160W లేదా 260W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ సపోర్టును అందించవచ్చు. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను అందించే అవకాశం ఉంది.

Infinix GT 10 Series Flipkart availability confirmed ahead of India launch

కొత్త ఇన్ఫినిక్స్ GT 10 Pro స్మార్ట్‌ఫోన్ సాధారణ 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేతో రానుందని భావిస్తున్నారు. కచ్చితమైన డిస్‌ప్లే ఇంకా వెల్లడి కాలేదు. 108MP ప్రైమరీ సెన్సార్, రెండు 8MP కెమెరాలతో సహా బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా చూడవచ్చు. మిగిలిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటివరకు, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉండనుంది. కంపెనీ తన రాబోయే ఫోన్ లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, రాబోయే రోజుల్లో లేదా వారాల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ధర ఎంత అనేది ఇంకా లీక్ కాలేదు.

Read Also : iQOO Z7 Pro 5G : కర్వడ్ డిస్‌ప్లేతో ఐక్యూ Z7 ప్రో 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?