Infinix GT 30 Pro : గేమర్లకు పండగే.. ఇన్ఫినిక్స్ GT 30ప్రో చూశారా? ఫీచర్ల కోసమైన కొని తీరాల్సిందే.. ధర ఎంతంటే?

Infinix GT 30 Pro : ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త గేమింగ్ ఫోన్ వచ్చేసింది.. అత్యాధునిక ఫీచర్లతో గేమింగ్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది..

Infinix GT 30 Pro

Infinix GT 30 Pro : గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇన్ఫినిక్స్ గేమింగ్-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ GT 30ప్రో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు ధరకు వచ్చేసింది.

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యమవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ చిప్‌సెట్, 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, షోల్డర్ వంటి ఫీచర్లతో మిడ్-కోర్ గేమింగ్ ఫీచర్లను కూడా అందిస్తుంది.

Read Also :  Oneplus 13s : ఏఐ ఫీచర్లతో వన్‌ప్లస్ 13s ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 5నే లాంచ్.. ధర కూడా మీ బడ్జెట్ ధరలోనే..!

అంతేకాదు.. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ కొత్త థర్మల్ డిజైన్, కస్టమైజడ్ RGB లైట్, ఎస్కార్ట్స్ మోడ్, (XBOOST) ఏఐ సాఫ్ట్‌వేర్ టూల్స్ కూడా అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ జీటీ 30ప్రో గేమింగ్ కిట్‌తో పాటు లాంచ్ అయింది. గేమింగ్ సెషన్ల సమయంలో కూలింగ్ ఫ్యాన్, మ్యాగ్‌కేస్ కూడా అందిస్తుంది. ఇన్ఫినిక్స్ GT 30ప్రో ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఇన్ఫినిక్స్ GT 30ప్రో స్పెసిఫికేషన్లు :
ఇన్ఫినిక్స్ GT 30 ప్రో ఫోన్ 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ ప్యానెల్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, 2,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ద్వారా 3.35GHz వరకు పవర్ అందిస్తుంది.

12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB UFS 4.0తో వస్తుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కాపర్, గ్రాఫైట్ షీట్‌లతో 400mm² VC కూలింగ్‌ను కూడా కలిగి ఉంది.

ఈ ఇన్ఫినిక్స్ 50 శాతం ఏఐ ఆడియో ట్యూనింగ్, సైబర్ మెచా డిజైన్ 2.0తో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా XOS 14పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ 108MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్‌ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఇన్ఫినిక్స్ 32MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.

భారత్‌లో ఇన్ఫినిక్స్ GT 30ప్రో ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999కు పొందవచ్చు.

గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాగ్నెటిక్ కూలింగ్ ఫ్యాన్, GT కేసుతో స్పెషల్ GT గేమింగ్ కిట్‌ను రూ.1,999 కు కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు రూ.1,199 తగ్గింపు ధరకు పొందవచ్చు.

Read Also : Redmi Note 14 Pro : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. ఇలా చేస్తే రూ. 26వేల రెడ్‌మి ఫోన్ కేవలం రూ. 7వేలకే..!

జూన్ 12, 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ డార్క్ ఫ్లేర్ RGB లైటింగ్‌తో బ్లేడ్ వైట్ LED లైటింగ్‌తో రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.