Infinix H0t 70 : ఇది ఫోన్ కాదు మ్యాజిక్.. రంగులు మారే డిజైన్‌తో ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్!.. ధర జస్ట్ ఎంతంటే?

Infinix H0t 70 : ఇన్ఫినిక్స్ హాట్ 7 ఫోన్ అదిరింది. రంగుల మార్చే రియర్ ప్యానెల్ డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఫీచర్ల పరంగా చూస్తే చాలా యూనిక్ ఉంటుంది. ధర, ఇతర ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

Infinix H0t 70 ( Image Credit : Gemini AI )

  • ఇన్ఫినిక్స్ హాట్ 70లో 6.78-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో వస్తుంది
  • రంగులు మార్చే థర్మో ఆరెంజ్ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్

Infinix H0t 70 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రంగులు మారే రియర్ ప్యానెల్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 70 ఫోన్ వచ్చేసింది. ఈ కంపెనీ ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G100 అల్టిమేట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌ అందిస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రంగులు మార్చే డిజైన్ :
థర్మో ఆరెంజ్ కలర్‌లో ఉన్న ఇన్ఫినిక్స్ హాట్ 70, టెంపరేచర్‌పై ఆధారపడి కలర్ మారే డిజైన్‌ అందిస్తుంది. ఈ ఫోన్ కూల్ ఉన్నప్పుడు బ్యాక్ ప్యానెల్ ముదురు ‘క్వైట్ ఆరెంజ్’ రంగులో కనిపిస్తుంది. కానీ, డివైజ్ వేడెక్కే కొద్దీ అది క్రమంగా బ్రైట్ ‘ప్లేఫుల్ ఆరెంజ్’ రంగులోకి మారుతుంది. రంగు మారకుండా ఉండే ఫినిషింగ్‌ను ఇష్టపడే కొనుగోలుదారులు గ్రీన్ టెక్స్‌చర్, క్వైట్ వైలెట్, డైవ్ బ్లూ, సిల్వర్ డాన్సర్, నైట్ పల్స్ వంటి 5 ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు.

Read Also : Summer AC Home Tips : కొత్త AC కొంటున్నారా? ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఏది బెస్ట్? ఫుల్ డిటెయిల్స్!

ఇన్ఫినిక్స్ హాట్ 70 ధర :
ఇన్ఫినిక్స్ హాట్ 70 ఫోన్ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర ఐడీఆర్ 2,199,000 (సుమారుగా రూ. 11,785), 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర IDR 3,199,000 (సుమారుగా రూ. 17,550), 6GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర IDR 3,399,000 (సుమారుగా రూ. 18,250)గా ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 70 స్పెసిఫికేషన్లు :
ఇన్ఫినిక్స్ హాట్ 70లో 720×1576 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఏఆర్ఎమ్ మాలి-G57 MC2తో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G100 అల్టిమేట్ 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

6GB/8GB LPDDR4X ర్యామ్, 128GB/256GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16పై రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఇన్పినిక్స్ హాట్ 70 బ్యాక్ సైడ్ ఎఫ్/1.85 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా ఈ ఫోన్ 167.92 మిమీ పొడవు, 79.12 మిమీ వెడల్పు, 7.49 మిమీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, Wi-Fi 6, 2×2 MIMO సపోర్ట్, బ్లూటూత్ 5.4, GNSS ఉన్నాయి.