iPhone vs Samsung Price : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధర, స్పెషిఫికేషన్లు ఇవే..

iPhone vs Samsung Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రెండు ఫోన్ల మధ్య తేడాలు ఏంటి? భారత మార్కెట్లో ఈ ఫోన్ల ధర ఎంత ఉంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

iPhone vs Samsung Price : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధర, స్పెషిఫికేషన్లు ఇవే..

iPhone 15 Pro Max vs Samsung Galaxy S23 Ultra_ Price in India, Specifications Compared

iPhone vs Samsung Price : కొత్త ఫోన్ కొనేవారికి అద్భుతమైన అవకాశం.. భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. గతవారమే ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఆపిల్ ‘వండర్లస్ట్’ ఈవెంట్‌లో లాంచ్ అయింది. ఐఫోన్ 15 సిరీస్ హై-ఎండ్ వేరియంట్‌గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ సిరామిక్ షీల్డ్ మెటీరియల్‌తో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఐఫోన్ 15 ప్రో మాక్స్ వంటి ధరల రేంజ్‌లో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ S23 అల్ట్రాను ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. 6.8-అంగుళాల ఎడ్జ్ QHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లేను కలిగి ఉంది. ఈ 2 స్మార్ట్‌ఫోన్‌లు సంబంధిత సిరీస్‌ల టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్‌లు గరిష్టంగా 1TB స్టోరేజీని అందిస్తాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

Read Also : iPhone 11 Price Cut : ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధర :
సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ కాగా.. సెప్టెంబర్ 22 నుంచి భారత మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం వేరియంట్‌లలో విక్రయిస్తోంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,59,900 కాగా, 512GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 1,79,900.

స్మార్ట్‌ఫోన్ 1TB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,99,900కి అందుబాటులో ఉంది. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ S23 Ultra ప్రారంభ ధర రూ. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,24,999, 512GB స్టోరేజ్ మోడల్ రూ. 1,34,999, 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,54,999గా నిర్ణయించిచంది. ఇప్పుడు, ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రెడ్, గ్రాఫైట్, లైమ్, స్కై బ్లూ కలర్‌వేస్‌ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

iPhone 15 Pro Max vs Samsung Galaxy S23 Ultra_ Price in India, Specifications Compared

iPhone 15 Pro Max vs Samsung Galaxy S23 Ultra_ Price in India, Specifications Compared

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ vs శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా: స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశాన్ని 2,000 నిట్‌ల వరకు అందిస్తుంది. ఆపిల్ కొత్త 3nm చిప్‌సెట్ A17 Pro SoC ద్వారా ఆధారితమైనది. గెలాక్సీ S23 అల్ట్రా, మరోవైపు, 6.8-అంగుళాల ఎడ్జ్ QHD+ (3,088 x 1,440 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC సపోర్టెడ్ వెర్షన్‌తో వచ్చింది. ఇది పైన One UI 5.1తో Android 13ని రన్ అవుతుంది. గ్రేడ్ 5 టైటానియం, అల్యూమినియంతో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మన్నికను అందిస్తుంది. ఐఫోన్ మ్యూట్ స్విచ్‌కు బదులుగా యాక్షన్ బటన్‌ను కూడా అందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. గెలాక్సీ S23 అల్ట్రా 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో కెమెరా, నాల్గో 10MP టెలిఫోటో షూటర్‌తో కూడిన 200MP ప్రైమరీ వైడ్ కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా 12MP షూటర్‌ను అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP వైడ్ యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 12MP 3x టెలిఫోటో కెమెరా, 12MP పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలకు 12MP TrueDepth కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ స్పెసిఫికేషన్లపై మాట్లాడుతూ.. ఇటీవల లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదిలో USB టైప్-C పోర్ట్‌ను పొందింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 24 గంటల కన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. గెలాక్సీ S23 Ultra 45W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. రెండు హ్యాండ్‌సెట్‌లు డెస్ట్, నీటి నిరోధకతకు IP68 రేటింగ్‌తో వస్తాయి.

Read Also : iPhone 16 Series Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. కొత్త బిగ్ లీక్ ఇదిగో.. ఐఫోన్ 15కు మించి అదిరే అప్‌గ్రేడ్స్..!