iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సేల్.. ఈ నెలల 22 నుంచే ప్రారంభం.. స్పెషల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు..!

iPhone 15 Sale : సెప్టెంబర్ 22న భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 అధికారికంగా విక్రయించనుంది. ఈ విక్రయానికి ముందు వివిధ అవుట్‌లెట్‌లు ఐఫోన్ 15 కొనుగోలుకు ప్రత్యేక ఆఫర్‌లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

iPhone 15 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15) లైనప్ సెప్టెంబర్ 12న (Apple Wonderlust) ఈవెంట్‌లో కంపెనీ ఆవిష్కరించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే ఐఫోన్ నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. USB టైప్-C ఛార్జింగ్ నుంచి అన్ని మోడల్‌లలో డైనమిక్ ఐలాండ్ నాచ్ వరకు, లేటెస్ట్ ఐఫోన్‌ల కోసం అనేక అప్‌గ్రేడ్‌లను ప్రకటించింది. ఐఫోన్‌లతో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 కూడా ఆవిష్కరించింది.

Read Also : iPhone 14 Series Price Cut : ఐఫోన్ 15 సిరీస్ రాగానే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

భారత మార్కెట్లో ఐఫోన్ ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి విక్రయించనుంది. ఈ విక్రయానికి ముందు, వివిధ అవుట్‌లెట్‌లు iPhone 15 కొన్ని ప్రత్యేకమైన ఆఫర్‌లను ప్రకటించాయి. క్రోమా నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకు, వివిధ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

క్రోమా (Croma) :
మీరు ఐఫోన్ 15ని ఆన్‌లైన్‌లో ప్రీ-ఆర్డర్ చేస్తే.. ఒకేసారి పూర్తి పేమెంట్ చెల్లించాలి. అయితే, క్రోమా ఫిజికల్ స్టోర్‌లకు పూర్తి పేమెంట్ అవసరం లేదు. మీ iPhone 15ని రూ. 2వేలతో ప్రీబుక్ చేయడానికి అనుమతిస్తుంది. మీరు HDFC క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే లేదా EMI పేమెంట్లను ఎంచుకుంటే iPhone 15, iPhone 15 Plus కోసం ఇన్‌స్టంట్ రూ. 5వేలు డిస్కౌంట్ అందిస్తుంది. ఐఫోన్ ప్రో మోడల్స్ రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ప్రీ-బుక్ చేయడానికి లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఒకదానిని విజిట్ చేయడానికి కస్టమర్‌లకు ఆప్షన్ ఉంటుంది. ఆన్‌లైన్ ప్రీ-ఆర్డర్‌లకు పూర్తి పేమెంట్ అవసరం ఉంటుంది. అయితే, క్రోమా ఫిజికల్ స్టోర్‌లు మరింత సరసమైన ఆప్షన్ అందిస్తాయి. టోకెన్ మొత్తాన్ని కేవలం రూ. 2వేలకు పొందవచ్చు. అదనంగా, మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే రూ. 6వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

iPhone 15 Sale begins on September 22 in India, here are special offers and discounts

ఐఫోన్ 15 డెలివరీ కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చని గతంలో నివేదించింది. అయితే, మీరు క్రోమాలో ఎక్స్‌ప్రెస్ డెలివరీని ఎంచుకుంటే.. డివైజ్ ప్రారంభమయ్యే రోజున అంటే.. సెప్టెంబర్ 22న మీ సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఆఫ్‌లైన్ స్టోర్‌లు కూడా సెప్టెంబర్ 22న ఉదయం 8:00 గంటలకు ప్రారంభమవుతాయి.

విజయ్ సేల్స్ (Vijay Sales) :
మరోవైపు విజయ్ సేల్స్ ద్వారా iPhone 15ని కొనుగోలు చేయడానికి HDFC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. నో-కాస్ట్ EMIతో పాటు రూ. 4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు HSBC క్రెడిట్ కార్డ్ EMI పేమెంట్ విధానం ద్వారా రూ. 7500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ ఉపయోగిస్తే.. రూ. 2,000 వరకు 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు :
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కూడా యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌లను కలిగి ఉన్నాయి. అమెజాన్‌లో, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. డెలివరీలు ఆలస్యం అవుతున్నట్లు నివేదికలు వచ్చినప్పటికీ, కస్టమర్‌లు సెప్టెంబర్ 23 నుంచి తమ ఫోన్‌లను పొందడం ప్రారంభిస్తారని అమెజాన్ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్‌కు వస్తున్నప్పుడు, ఇ-కామర్స్ స్టోర్ ఐఫోన్ 15 సిరీస్‌ను ప్రీ-ఆర్డర్ చేయడంపై ప్రత్యేక డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

Read Also : iOS 17 for iPhones : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. iOS 17 అప్‌డేట్ ఇదిగో.. టాప్ ఫీచర్లు, ఏయే డివైజ్‌ల్లో అందుబాటులో ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు