Google Pixel 9a : ఖతర్నాక్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10a కన్నా పిక్సెల్ 9a బెటర్ భయ్యా.. ఎందుకంటే?
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో అసలు ధర రూ.38,699 ఉండగా రూ. 11,300 నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ మీకోసమే..
Google Pixel 9a
- భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9ఎ ప్రారంభ ధర రూ. 49,999 లాంచ్
- అమెజాన్‌లో రూ.38,699కి లిస్టింగ్, ధర రూ.11,300 నేరుగా తగ్గింపు
- బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేయొచ్చు
- గూగుల్ పిక్సెల్ 10a లాంచ్ తర్వాత భారీగా తగ్గిన పాత మోడల్
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. గూగుల్ పిక్సెల్ 9a ధర భారీగా తగ్గింది. గూగుల్ పిక్సెల్ 10a లాంచ్ తర్వాత పాత పిక్సెల్ మోడల్ పిక్సెల్ 9ఎ మోడల్ అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. కొత్త మోడల్ లేటెస్ట్ కలర్ ఆప్షన్లు, పీక్ బ్రైట్నెస్ సహా అప్‌గ్రేడ్స్ తీసుకొచ్చినప్పటికీ పాత పిక్సెల్ 9ఎ ఇప్పటికీ చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది.
పిక్సెల్ 10ఎ ఫీచర్లు కూడా దాదాపు పిక్సెల్ 9ఎ మాదిరిగానే ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి ఈ డీల్ బెస్ట్ ఛాయిస్.. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఆసక్తి ఉంటే వెంటనే కొనేసుకోవడం బెటర్. ఇంతకీ, పిక్సెల్ 9a ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
గూగుల్ పిక్సెల్ 9a డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ రూ.49,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.38,699కి లిస్ట్ అయింది. తద్వారా రూ.11,300 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు.
అలాగే, మీరు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.2,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అప్పుడు ఇంకా తక్కువ ధరకే పిక్సెల్ 9a ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 422.2 పీపీఐ వద్ద ఫుల్ HD+ (1080×2424 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
HDR కంటెంట్ కోసం డిస్ప్లే 1800 నిట్స్ వరకు బ్రైట్నెస్ లెవల్స్ అందిస్తుంది. 2700 నిట్స్ వద్ద గరిష్టంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. హుడ్ కింద, పిక్సెల్ 9a గూగుల్ టెన్సర్ G4 చిప్‌పై రన్ అవుతుంది. 5100mAh బ్యాటరీతో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9a డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా కూడా ఉంది.
