×
Ad

iPhone 16 Pro : ఆఫర్ అదిరింది బ్రో.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇలాంటి డీల్ అసలు మిస్ చేయొద్దు!

iPhone 16 Pro : ఐఫోన్ 16 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 16 Pro

iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర తగ్గింది. పండగ సేల్ తర్వాత కూడా ఫ్లిప్‌కార్ట్ అనేక ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త ఐఫోన్ 17 కన్నా తగ్గింపు ధరకే ఐఫోన్ 16 ప్రో కొనేసుకోవచ్చు. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే అద్భుతమైన అవకాశం. ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 ప్రో ధరను రూ.10వేలు తగ్గించింది. అసలు (iPhone 16 Pro) ధర రూ.1,19,900 నుంచి రూ.1,09,990కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు అదనంగా రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర మరింత తగ్గుతుంది.

Read Also : Motorola Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. మోటోరోలా నుంచి 3 కొత్త 5G ఫోన్లు.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఉండలేరు!

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే వర్కింగ్ కండిషన్, మోడల్‌ను బట్టి వాల్యూ మారుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే సూపర్-ఫాస్ట్ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ డెలివరీని అందిస్తోంది. మీ బ్రాండ్-న్యూ ఐఫోన్‌ను 20 నిమిషాలలోపు పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 120Hz ప్రోమోషన్, HDR10, 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. హుడ్ కింద 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లతో A18 ప్రో చిప్ ఉంది. 3582mAh బ్యాటరీ కలిగి ఉంది. 25W వైర్డ్ ఛార్జింగ్, 15W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 48MP మెయిన్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మరో 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, 12MP ఫ్రంట్ షూటర్, ఫేస్‌టైమ్‌కు మిర్రర్ సెల్ఫీ, ఐఫోన్ 16 ప్రో బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, డెసర్ట్ టైటానియం కలర్ ఆప్షన్లలో వస్తుంది.