Motorola Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. మోటోరోలా నుంచి 3 కొత్త 5G ఫోన్లు.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఉండలేరు!
Motorola Phones : మోటోరోలా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఫోన్లు వచ్చేశాయి. మోటో G57 పవర్ 5G, మోటో G57 5G ఫోన్లు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి..
Motorola Phones
Motorola Phones : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? గ్లోబల్ మార్కెట్లో మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్లు వచ్చేశాయి. మోటోరోలా ఎడ్జ్ 70, మోటో G57 5G, మోటో G57 పవర్ 5G ఫోన్లు లాంచ్ అయ్యాయి. మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్ యూరప్, మిడిల్ ఈస్ట్ అంతటా రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్ డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లు, ఆకట్టుకునే కెమెరా అప్‌గ్రేడ్‌లతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 70 pOLED డిస్‌ప్లేతో స్లిమ్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ కలిగి ఉంది. ఈ లైనప్‌లో (Motorola Phones) అత్యంత ప్రీమియం ఫోన్ ఇదే. మందం కేవలం 5.99mm మాత్రమే. ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ నైలాన్-టెక్చర్డ్ ఫినిషింగ్‌తో కలిగి ఉంది. భారతీయ యూజర్ల కోసం కూడా అతి త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మోటో G57 పవర్ 5G, మోటో G57 5G ఫోన్ లాంచ్, కీలక ఫీచర్లు వివరాలపై ఓసారి లుక్కేయండి.
ధర, కలర్ వేరియంట్లు :
ధర : 799 యూరోలు (సుమారు రూ. 81వేలు)
కలర్ ఆప్షన్లు : పాంటోన్ లిల్లీ ప్యాడ్, బ్రాంజ్ గ్రీన్, గాడ్జెట్ గ్రే
మోటోరోలా ఎడ్జ్ 70 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
6.67-అంగుళాల pOLED 120Hz డిస్‌ప్లే, HDR10+, 4500 నిట్స్, గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్
ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
ర్యామ్/స్టోరేజ్ : 12GB LPDDR5x ర్యామ్, 512GB uMCP స్టోరేజ్ ఆన్‌బోర్డ్
రియర్ కెమెరాలు : బ్యాక్ సైడ్ డ్యూయల్ షూటర్ (50MP OIS మెయిన్ + 50MP అల్ట్రా-వైడ్)
ఫ్రంట్ కెమెరా : ఫ్రంట్ సైడ్ ఆటో ఫోకస్‌తో 50MP షూటర్
బ్యాటరీ : 4800mAh సపోర్టు, 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్ : హలో యూఐ (3 OS అప్‌గ్రేడ్‌లు)తో ఆండ్రాయిడ్‌తో 16OS
సర్టిఫికేషన్ : IP68 + IP69 రేటింగ్
ఆడియో : డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లకు సపోర్టు
ఎడ్జ్ 90 పర్ఫార్మెన్స్, ప్రీమియం ఫొటోగ్రఫీకి అద్భుతంగ ఉంటుంది. మోటో G57 పవర్ 5G, మోటో G57 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌తో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు కాగా మోటోరోలా రెండు మిడ్-రేంజ్ మోడళ్లను
లాంచ్ చేసింది. ఇందులో మోటో G57 పవర్ 5G, మోటో G57 5G ఫోన్ ఉన్నాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్ ఆధారితంగా రన్ అవుతాయి.
ధర వివరాలు :
మోటో G57 పవర్ 5G : 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర యూరో 279 (సుమారు రూ. 28,400), 7000mAh బ్యాటరీ
మోటో G57 5G : 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 5200mAh బ్యాటరీతో ధర యూరో 249 (సుమారు రూ. 25,300).
డిస్‌ప్లే, బిల్డ్ : మోటో G57 పవర్, మోటో G57 5G
మోటోరోలా రెండు ఫోన్లలో ఫీచర్లు ఇవే :
డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల FHD+ IPS LCD
గొరిల్లా గ్లాస్ 7i, MIL-STD-810H, IP64 ప్రొటెక్షన్
పర్ఫార్మెన్స్ : స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్
బ్యాక్ కెమెరాలు : 50MP సోనీ LYT-600 + 8MP అల్ట్రా-వైడ్
ఫ్రంట్ కెమెరాలు : 8MP సెల్ఫీ కెమెరాలు
కనెక్టివిటీ : 5G SA/NSA Wi-Fi 5 బ్లూటూత్ 5.1 NFC USB టైప్-C 3.5mm ఆడియో జాక్
