iPhone 17 Pro Price : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో కోసం వెయిట్ చేయడం వేస్టేనా? ఐఫోన్ 17 ప్రోపై అదిరిపోయే ఆఫర్!

iPhone 17 Pro Price : ఆపిల్ కంపెనీ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లను సెప్టెంబర్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబోతోంది. అంతకన్నా ముందే ఐఫోన్ 17 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 17 Pro Price

  • 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే
  • 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌
  • సెప్టెంబర్ 9న ఆపిల్ మెగా ఈవెంట్, ఐఫోన్ 18 ప్రో సిరీస్

iPhone 17 Pro Price : ఐఫోన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆపిల్ సెప్టెంబర్ 9న మెగా ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లను వరల్డ్ వైడ్ మార్కెట్లో లాంచ్ చేస్తోంది. ఇందులో ప్రధానంగా స్టాండర్డ్ ఐఫోన్ 18 లాంచ్ అయ్యే ఛాన్స్ లేదు.

అయితే, లేటెస్ట్ ఐఫోన్ లాంచ్ ముందే ఐఫోన్ 17 ప్రోపై భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇప్పుడు ఐఫోన్ కొనాలని చూస్తుంటే తక్కువ ధరకే (iPhone 17 Pro Price) సొంతం చేసుకోవచ్చు. కొత్త ఐఫోన్ 18 ప్రో కన్నా ఐఫోన్ 17 ప్రో అతి చౌకైన ధరలో లభిస్తోంది. కొత్త ఐఫోన్ కోసం ఆగాలా? లేదా తగ్గింపు ధరలో ఐఫోన్ 17 ప్రో కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి.

ఐఫోన్ 17 ప్రో ధర, ఆఫర్లు :
గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.1,34,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రో 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.1,29,590 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.6వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఈ ఐఫోన్ 17 ధర రూ.1,23,590 అవుతుంది.

ఈ ఐఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ.11,310 తక్కువకే లభిస్తోంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఇంకా ఆదా చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్, టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ చేసే ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Motorola Edge 60 Pro : వావ్.. మోటోరోలా ఫోన్ ఇంత తక్కువా? 6000mAh బ్యాటరీ, 256GB స్టోరేజ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు :

ఐఫోన్ 17 ప్రో 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2622×1206 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, టాప్ బ్రైట్ నెస్ 3,000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ కూడా ఉంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. :
ఐఫోన్ 17 ప్రోలో ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా ఎఫ్/2.8 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో USB 3.0 టైప్-సి పోర్ట్, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్ బ్లూటూత్ 6 ఉన్నాయి.

కొత్త ఐఫోన్ 18 ప్రోలో ఏముంది? :
ఆపిల్ 18 ప్రోలో 48MP వేరియబుల్ అపర్చర్, ప్రైమరీ కెమెరాతో వస్తుందని అంచనా. భారీ 5000mAh బ్యాటరీ కూడా ఉండొచ్చు. ప్రో వేరియంట్లలో బైస్కోప్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుందని అంచనా. ఫోన్ మందంతో పాటు బరువు పెరగవచ్చు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ ఉండొచ్చు.

ఈ ఐఫోన్‌లో 6.9-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండొచ్చు. ఈ లేటెస్ట్ ఐఫోన్‌లో ఆపిల్ A20 ప్రో చిప్‌సెట్ ఉంటుందని అంచనా. TSMC అడ్వాన్స్ 2nm తయారీ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. భారీ ర్యామ్ స్టోరేజ్ కారణంగా ఈసారి ఐఫోన్ 18 ప్రో ధర ఎక్కువగా ఉండొచ్చు.