Motorola Edge 60 Pro : వావ్.. మోటోరోలా ఫోన్ ఇంత తక్కువా? 6000mAh బ్యాటరీ, 256GB స్టోరేజ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Motorola Edge 60 Pro Deal : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? 6000mAh బ్యాటరీ, 256GB స్టోరేజ్ అందించే ఈ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఇంతకన్నా తక్కువ ధరకు మళ్లీ దొరకదు..
Motorola Edge 60 Pro Deal
- ఫ్లిప్‌కార్ట్‌లో రూ.29,999 ధరకు సొంతం చేసుకోవచ్చు
- బ్యాంకు ఆఫర్లతో ఈ ఫోన్ ధర రూ.27,549కు తగ్గింపు
- ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మీ పాత ఫోన్‌పై రూ.28వేల వరకు ఆదా
Motorola Edge 60 Pro Deal : మోటోరోలా లవర్స్ ఈ డీల్ మీకోసమే.. 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఏడాది మే నెలలో అమ్మకానికి వచ్చింది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ 4nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
6000mAh బ్యాటరీ కూడా ఉంది. 90W టర్బోపవర్ 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ప్రస్తుత ధరల ప్రభావం ఈ ఫోన్‌పై ఇంకా పడలేదు. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో అద్భుతమైన ధరకు లభిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోపై బెస్ట్ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో డీల్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 8GB+256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.29,999 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2,450 తగ్గింపు అందిస్తుంది. తద్వారా ధర రూ.27,549 అవుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ.28వేల వరకు ఆదా చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ డివైజ్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
Read Also : Apple Mega Event : సెప్టెంబర్ 9న ఆపిల్ నుంచి భారీ సర్ప్రైజ్లు! ఐఫోన్18 ప్రో నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ వరకు
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.7-అంగుళాల pOLED డిస్ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ 4nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఎడ్జ్ 60 ప్రో ఆండ్రాయిడ్ 15పై 6,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 90W టర్బోపవర్ 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫోటో ఫోకస్, అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు వీడియో కాల్స్ పరంగా చూస్తే.. ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఎడ్జ్ 60 ప్రోలోని కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.4, వై-ఫై 6E, 5G, NFC, GPS కనెక్టివిటీ ఉన్నాయి.
