iPhone 17e Price
iPhone 17e Price : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 17e రాబోతుంది. అయితే, ఈ సరసమైన ఐఫోన్ లాంచ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆపిల్ మొదట ఫిబ్రవరి 19న ఐఫోన్ 17eని లాంచ్ చేయాలని నిర్ణయించింది. కానీ, కానీ ఇప్పుడు లాంచ్ వాయిదా పడింది.
ఇటీవలి నివేదికల ప్రకారం.. మార్చి 4న ‘స్పెషల్ ఆపిల్ ఎక్స్‌పీరియన్స్’ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ అనేక సరికొత్త ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. ఇదే సమయంలో ఐఫోన్ 17e మోడల్ కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకూ రాబోయే ఐఫోన్ మోడల్ గురించి ఏయే ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయో వివరంగా తెలుసుకుందాం.
ఈ ఐఫోన్ 6.1-అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 2,000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. డైనమిక్ ఐలాండ్ కలిగి ఉండే అవకాశం ఉంది. బ్లాక్, వైట్ సహా లావెండర్ లేదా పర్పుల్ ఫినిషింగ్‌లలో కూడా అందుబాటులో ఉండనుంది. ఫ్రంట్ సైడ్ డిజైన్ ఐఫోన్ 15 మాదిరిగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఐఫోన్ 16e పోలి ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 17e A19 చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు. 3nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. ఐఫోన్ 17లో అదే చిప్‌సెట్ ఉండొచ్చు. ఆపిల్ C1X మోడెమ్, N1 చిప్‌తో రావొచ్చు. ఐఫోన్‌కు మెరుగైన 5G స్పీడ్, పవర్ కెపాసిటీని అందిస్తుంది. ఆపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్ల కోసం 8GB ర్యామ్ కూడా అందించనుంది.
కెమెరా, బ్యాటరీ (అంచనా) :
ఐఫోన్ 17e రియర్ సైడ్ 48MP సింగిల్ ఫ్యూజన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఐఫోన్ 16e మాదిరిగానే ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఐఫోన్ 17 మాదిరిగానే 18MP సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది. ఆపిల్ ఈ ఫోన్‌లో 4,005mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. ఐఫోన్ 17 కన్నా పెద్దదిగా ఉండొచ్చు.
ధర (అంచనా) :
నివేదికల ప్రకారం.. ఈ ఐఫోన్ 17e ధర పెంచే అవకాశం కనిపించడం లేదు. ఈ ఐఫోన్ 17e 128GB స్టోరేజీ బేస్ వేరియంట్ భారత మార్కెట్లో దాదాపు రూ. 59,900 ధరకు లాంచ్ కావచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 17e మోడల్ 599 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. పోటీ పరంగా చూస్తే.. ఇటీవల లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10aతో పోటీ పడుతుంది. ఈ పిక్సెల్ ఫోన్ రూ. 49,900 ధరకు లాంచ్ అయింది.