Apple iPhone 18 Series : ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక స్పెసిఫికేషన్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..

Apple iPhone 18 Series : ఆపిల్ నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ ముందే లీక్‌లతో కీలక వివరాలను బయటకు వచ్చాయి. సెప్టెంబరులో జరిగే లాంచ్ ఈవెంట్లో కంపెనీ 18 ప్రో, 18 ప్రో మాక్స్‌ మోడల్స్ లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Apple iPhone 18 Series

Apple iPhone 18 Series : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆపిల్ నుంచి నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. దాదాపు 3 నెలల టైమ్ ఉన్నా లీకులతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ ఐఫోన్ 18 మోడల్ కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి. కాలిఫోర్నియాకు చెందిన ఈ టెక్ కంపెనీ సెప్టెంబర్‌లో జరిగే లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లను ఆవిష్కరించనుంది.

అయితే, ఈ రెండు మోడళ్లతో పాటు స్టాండర్డ్ ఐఫోన్ 18 లాంచ్ కాదని పలు నివేదికలు చెబుతున్నాయి. పుకార్ల ప్రకారం.. ఈసారి ఫోల్డబుల్ ఐఫోన్‌ లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆపిల్ 2027 ఆరంభం వరకు స్టాండర్డ్ 18 మోడల్ లాంచ్ చేసే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పుడు, ఐఫోన్ 18 సిరీస్‌కు సంబంధించిన ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు, లాంచ్ ఈవెంట్, ధరల పెంపు సహా పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

ఐఫోన్ 18, 18 ప్రో, 18 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
నివేదికల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో లైనప్ పరంగా ఆపిల్ రాబోయే A20 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్‌ను టీఎస్ఎంసీ అడ్వాన్స్ 2nmతో తయారైనట్టు అంచనా. పర్ఫార్మెన్స్, పవర్ కెపాసిటీ రెండింటినీ అప్ గ్రేడ్ చేస్తుంది. ఆన్‌లైన్ లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ ప్రో మోడళ్లలో 12GB వరకు ర్యామ్ ఉండవచ్చని అంచనా. మల్టీటాస్కింగ్‌, ఫ్యూచర్ ఏఐ ఆధారిత ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది.

డిజైన్ లీక్‌లను పరిశీలిస్తే.. ఐఫోన్ 18 ప్రో సిరీస్ అనేక కలర్ ఆప్షన్లతో వస్తుందని వెల్లడించాయి. నివేదికల ప్రకారం.. టిమ్ కుక్ నేతృత్వంలోని ఆపిల్, ఐఫోన్ 18 ప్రో సిరీస్ కోసం చెర్రీ, లైట్ బ్లూ, బ్లాక్/బ్రైట్ యాష్ కలర్, సిల్వర్ కలర్ ఆప్షన్లను టెస్టింగ్ చేస్తోంది. ఇందులో చెర్రీ ఈ సిరీస్ సిగ్నేచర్ కలర్‌గా వస్తోంది. గత ఏడాదిలో కాస్మిక్ ఆరెంజ్ కలర్ లొకేషన్ రిప్లేస్ చేస్తుందని భావిస్తున్నారు.

Read Also : Apple Price Hike : ఆపిల్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారత్‌లో భారీగా పెరిగిన ఐప్యాడ్, మ్యాక్‌బుక్ ధరలు.. కొత్త ధర తెలిస్తే కంగుతింటారు..!

కెమెరా విషయానికి వస్తే.. :
కొన్ని మెయిన్ అప్‌గ్రేడ్‌లను చూడవచ్చు. ఆపిల్ వేరియబుల్ అపర్చర్‌తో కూడిన మెయిన్ కెమెరాను టెస్టింగ్ చేస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. లెన్స్‌లోకి ప్రవేశించే కాంతి సైజు కూడా ఫిజికల్ అడ్జెస్ట్ చేసేందుకు ఫీచర్ కూడా అందించనుంది.

తక్కువ కాంతిలో ఫొటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్‌లు, ఎక్స్‌పోజర్ కంట్రోలింగ్ అప్ గ్రేడ్ చేయొచ్చు. అదనంగా, కొత్త స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్, అప్‌గ్రేడ్ టెలిఫోటో సిస్టమ్ ద్వారా జూమ్ ఫోటోగ్రఫీలో మరిన్ని అప్ గ్రేడ్స్ ఉంటాయని ఇతర లీక్‌లు సూచిస్తున్నాయి.

స్టాండర్డ్ ఐఫోన్ 18 పరంగా చూస్తే.. :
6.3-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. చిన్న డైనమిక్ ఐలాండ్‌తో వస్తుంది. నివేదికలను పరిశీలిస్తే.. అద్భుతమైన డిస్‌ప్లే టెక్నాలజీ, అదే 2nm ప్రాసెస్‌పై స్టాండర్డ్ A20 ప్రాసెసర్‌తో కూడా వస్తుందని సూచిస్తున్నాయి.

ఐఫోన్ 18, 18 ప్రో, 18 ప్రో మాక్స్ ధరలు (అంచనా) :
ధరల విషయానికి వస్తే.. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవలే ధరలు పెంపుపై ప్రకటించారు. ఐఫోన్ తయారీదారు మొత్తం లైనప్‌లోని ధరలను 100 డాలర్ల నుంచి 150 డాలర్లు (సుమారుగా రూ. 8వేల నుంచి రూ.15వేల) వరకు పెంచవచ్చని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పుకార్లు నిజమైతే.. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ 2026 సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ కావచ్చు.. ఇందులో స్టాండర్డ్ ఐఫోన్ 18 మోడల్ మాత్రం 2027లో వచ్చే అవకాశం ఉంది.